ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది: నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని

0
110

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సిద్దు ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు, వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం.

కొత్త  దర్శకుడు  ఇలాంటి వార్ సబ్జెక్టు తో అవకాశం ఇవ్వడం రిస్క్ అనిపించలేదా ?
దర్శకుడు శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ వుంది. తన విజన్ క్లియర్ గా వుంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ వుంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చాలా గ్రాండ్ గా వచ్చింది. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో సినిమాని షూట్ చేశాం. అందుకే విజువల్స్ అంత నేచురల్ గా ఎఫెక్టివ్ గా వచ్చాయి. దర్శకుడు టెక్నికల్ గా చాలా సౌండ్. అన్ని విభాగాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది.

ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసి ఎలా స్పందించారు?
ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రసంశించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.

వరుణ్ తేజ్ గారు ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.. అక్కడ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి?
ఇప్పటికే అక్కడ చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. వరుణ్ గారు అక్కడ చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వుంది. ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం.

సిద్దు గారు.. సోనీ పిక్చర్స్ తో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
సోనీ వారిది కార్పోరేట్ స్టైల్. నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి వారి పద్దతులపై  ఒక అవగాహన వుంది. సోనీ పిక్చర్స్ తో వర్క్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?
మిక్కీ జే మేయర్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

పెయిడ్ ప్రీమియర్స్ వేసే ఆలోచన ఉందా ?
దాని గురించి చర్చిస్తున్నాం. ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం.

మానుషి చిల్లర్ పాత్ర ఎలా వుంటుంది ?
మానుషి పాత్ర ఇందులో చాలా కీలకంగా వుంటుంది. దేశభక్తి ఒక కోణం అయితే వరుణ్, మానుషి పాత్రల మధ్య వుండే రిలేషన్ షిప్ కూడా కథలో చాలా కీలకంగా వుంటుంది.

సిద్దు గారు.. ఇప్పటివరకు మీరు వరుణ్ తేజ్ గారితోనే సినిమాలు చేశారు.. బయట హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ?
ఖచ్చితంగా. నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని వుంది. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం నా దృష్టి  ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలపై వుంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇలా హెవీ సీజీ వర్క్స్, స్టేడియంలు లేకుండా ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన వుంది. (నవ్వుతూ)

ఆల్ ది బెస్ట్
థాంక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here