“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
“హ్యాపీ ఎండింగ్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ ‘ఓరి పిల్లగాడ…’, ‘నగుమోము…’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా “హ్యాపీ ఎండింగ్” సినిమా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
నటీనటులు – అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం – రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి
ఎడిటర్ – ప్రదీప్ ఆర్ మోరమ్
స్క్రీన్ ప్లే – నాగసాయి
లైన్ ప్రొడ్యూసర్ – ప్రసాద్ బిల్లకుర్తి
పీఆర్వో – జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కిరణ్ రామానుజం
ప్రొడ్యూసర్స్ – యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
స్టోరీ డైరెక్షన్ – కౌశిక్ భీమిడి



