గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సి 16 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్‌.రెహ‌మ‌న్ సంగీతం

0
166

గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, స‌న్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన క‌ల‌యిక‌లో రూపొంద‌నున్న పాన్ ఇండియా చిత్రానికి ప్ర‌పంచ‌స్థాయి సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్‌. రెహ‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌ను శ‌నివారం రెహ‌మ‌న్ గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విడుదల చేశారు చిత్ర నిర్మాత‌లు. ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ ప‌తాకంపై వెంక‌ట స‌తీష్ కిలారు క్రియేటివ్ జీనియ‌స్ పాన్ ఇండియా స‌న్సేష‌న్ ద‌ర్శ‌కుడు సుకుమార్ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప‌తాకంపై సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌ముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొంద‌బోతుంది. ఈ చిత్రానికి సంగీతం అందించ‌డం ఎంతో ఎగ్జ‌యింటింగ్‌గా వుంద‌ని గ‌తంలో ఎఆర్ రెహ‌మాన్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు మేక‌ర్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here