“వధువు” లోని ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – టీమ్

0
61

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”. ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో దర్శకుడు పోలూరు కృష్ణ రూపొందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి “వధువు” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో “వధువు” హైలైట్స్ తెలిపారు వెబ్ సిరీస్ టీమ్.

యాక్టర్ నందు మాట్లాడుతూ – నేను సవారీ, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హాట్ స్టార్ నుంచి వధువు ఆఫర్ వచ్చింది. బెంగాళీలో సీజన్ 2, సీజన్ 3 కూడా ఉన్నాయి. మీరెవరూ ఆ సిరీస్ లు చూడకండి. మన “వధువు” సిరీస్ లు వాటి కంటే చాలా బాగుంటాయి. ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఇంత డిఫరెంట్ గా ఎలా ఉన్నారు, ఇంత సస్పీషియస్ గా ఎందుకు ఉన్నారు అనేది మీకు ఆసక్తి కలిగిస్తుంది. ఇదే కాదు “వధువు” సీజన్ 2 ఇంకా బిగ్గర్ కాన్వాస్ లో ఉంటుంది. ఈ సిరీస్ లో నటించేప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. షూట్ అయిపోయినా మేము బయటకు వెళ్లేవాళ్లం కాదు. అదే సెట్ లో మరో రెండు మూడు గంటలు మా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. హాట్ స్టార్ మనకున్న పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్. అలాంటి ప్లాట్ ఫామ్ చేస్తున్న ఒరిజినల్స్ లో నేను లీడ్ రోల్స్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ప్రశాంత్ వర్మ కథతో మరో హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ చేయబోతున్నా. అలాగే బెక్కెం వేణుగోపాల్ గారి ప్రొడక్షన్ లో నేను అవికా కలిసి సినిమా చేస్తున్నాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నారు

యాక్టర్ అలీ రెజా మాట్లాడుతూ – “వధువు” సిరీస్ కోసం నాకు ఒకరోజు కాల్ వచ్చింది. 30 డేస్ కాల్షీట్స్ కావాలని అడిగారు. అప్పుడు నేను వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అందులో నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ లుక్ లో బియర్డ్, జుట్టు ట్రిమ్ చేసి ఉంటుంది. అదే విషయం హాట్ స్టార్ వాళ్లకు చెప్పాను. వాళ్లు ఆలోచిస్తాం అన్నారు. ఇంతలో ఆపరేషన్ వాలెంటైన్ షూట్ మరో రెండు నెలలు పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో హాట్ స్టార్ కు చెప్పి “వధువు” క్యారెక్టర్ కోసం రెడీ అయ్యాను. ఈ సిరీస్ లో నా క్యారెక్టర్ పర్ ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. ఎంత వరకు నటించాలో డైరెక్టర్ కృష్ణ దగ్గరుండి తీసుకున్నారు. మేము సెట్ లోకి వెళ్లేప్పటికే ఆ సీన్ మూడ్ క్రియేట్ అయి ఉండేది. సెట్ లో వాతావరణం అలా ఉంచేవారు. “వధువు” సిరీస్ ష్యూర్ హిట్ అవుతుంది. అన్నారు.

దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ – బెంగాళీ వెబ్ సిరీస్ ఇందును “వధువు”గా మేము రీమేక్ చేశాం. ఒరిజినల్ వెబ్ సిరీస్ చూసినప్పుడు ఆ కథలోని సోల్ నాకు బాగా నచ్చింది. అయితే మన నేటివిటీకి తగినట్లు క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాం. ఒరిజినల్ కు మన సిరీస్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేరుకే ఇది బెంగాలీ రీమేక్ అని చెప్పుకోవాలి. ఇందుకోసం మా టీమ్ అంతా పర్ ఫెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది. “వధువు” సిరీస్ ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నటి రూప మాట్లాడుతూ – “వధువు” వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు పోలూరు కృష్ణ గారికి థ్యాంక్స్. ఆయన దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో ఉండేది. ఒక మంచి క్యారెక్టర్ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని వెయిట్ చేస్తున్న నాకు “వధువు” వెబ్ సిరీస్ తో అలాంటి క్యారెక్టర్ లభించింది. మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు ప్రతీ సీన్ కూడా ఆర్టిస్ట్ కు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. నేను బుక్స్ ఎక్కువ చదువుతాను, మనుషుల తీరును గమనిస్తుంటాను. అలా నటిగా సహజంగా ఎలా కనిపించాలో తెలుసుకున్నాను. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ అనుమానించేలా ఉంటుంది. నెక్ట్ సీన్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. “వధువు” వెబ్ సిరీస్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అని చెప్పింది

ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ – “వధువు” వెబ్ సిరీస్ కు ఎడిటర్ గా పనిచేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. దర్శకుడు కృష్ణ గారి సూచనల మేరకు వర్క్ చేశా. క్యారెక్టర్స్ మూడ్, అవి బిహేవ్ చేసే తీరును బట్టి ఎడిటింగ్ చేస్తుంటాము. నెరేషన్ పేస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ కు ఎడిటింగ్ చేశాను. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి మాట్లాడుతూ – “వధువు” వెబ్ సిరీస్ కు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, హాట్ స్టార్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సిరీస్ కు మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది. వాళ్ల పర్ ఫార్మెన్స్ చూసి నేను ఇన్స్ పైర్ అయి మ్యూజిక్ చేశాను. మ్యూజీషియన్స్, సింగర్స్ అందరూ బాగా వర్క్ చేశారు. “వధువు” వెబ్ సిరీస్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here