రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘యానిమల్’ చార్ట్ బస్టర్ ఆల్బమ్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే విడుదలైన “అమ్మాయి”, “నే వేరే “, ‘నాన్న నువ్వు నా ప్రాణం’ పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ప్రశంసలు అందుకున్నాయి.
తాజాగా యానిమల్ నుంచి “అర్జన్ వైలీ” ట్రాక్ ని విడుదల చేశారు. ఈ పాట హీరో రోల్ కి సంబధించిన జర్నీ ని ఒక ఇంటెన్స్ గ్లింప్స్ గా ప్రజెంట్ చేస్తూ అంచనాలు మరింతగా పెంచింది. భూపిందర్ బబ్బల్ కమాండింగ్ వాయిస్ ,లిరిక్స్ మనన్ భరద్వాజ్ అద్భుతమైన కంపోజిషన్ తో.. వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్ పాత్ర జర్నీలో ఈ ట్రాక్ చాలా కీలకంగా వుంది.
You asked, and we heard 😉#ArjanVailly Song out now 🪓https://t.co/NfGmn52ZNi#Animal4thSong #Animal #AnimalOn1stDec #AnimalTheFilm #MananBhardwaj #BhupinderBabbal #HimanshuShirlekar @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/oPpB1X7iFU
— BA Raju's Team (@baraju_SuperHit) November 18, 2023
‘అర్జన్ వైలీ” రణబీర్ కపూర్ పాత్ర కాంప్లెక్స్ లేయర్స్ ని ప్రతిబింబించే పవర్ ఫుల్ లిరికల్ జర్నీ. ఈ ట్రాక్ యానిమల్ సారాంశాన్ని తెలియజేస్తోంది. ఇది రణబీర్ కపూర్‌కి లైఫ్ టైమ్ రోల్ గా ప్రామిస్ చేస్తోంది. ఈ లేటెస్ట్ ట్రాక్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది.
రణబీర్ కపూర్ తో పాటు బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్ ని అందించే ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న గ్రాండ్ గా విడుదల కానుంది.