‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో విక్రాంత్ వంటి యంగ్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్‌గానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను విక్రాంత్ అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్షర్ థిల్లాన్‌లు హీరోయిన్లుగా నటించారు.
హృదయం, ఖుషి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ద నటుడైన గురు సోమసుందరం ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. దీంతో సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది.
The Mesmerizing and Magical Melody #Radhesha ❤️ is out now! 🤩
Listen now 🎧- https://t.co/FDjDQMtjJO #SPARKTheLife Gearing up Grand Worldwide Release on Nov 17th ⚡
A @HeshamAWMusic Musical 🎹@ThisIsVikranth @Mehreenpirzada @RuksharDhillon @adityamusic @Deaffrog_Prod pic.twitter.com/2G21XfyltF
— BA Raju's Team (@baraju_SuperHit) November 8, 2023
ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఐదో పాటను విడుదల చేశారు. ‘రాధేశా’ అంటూ సాగే ఈ పాట విక్రాంత్, మెహరీన్ మధ్య ప్రేమ, విరహ బాధను చూపించేలా ఉంది. విక్రాంత్ కోసం లేఖ పడే తాపత్రయాన్ని చూపించారు.
హేషమ్ అందించిన బాణీ.. శ్వేతా మోహన్ గాత్రం.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. ఈ పాటను ఎంతో మాధుర్యంగా మార్చాయి. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
youtu.be/jH5ev8nt7L4