గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి ధీటుగా సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్.
దీపావళి సందర్భంగా ‘గేమ్ చేంజర్’ నుంచి తొలి సాంగ్‌గా ‘జరగండి..’ అనే పాటను విడుదల చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎదురు చూస్తున్న అభిమానులు, ఆడియెన్స్‌కి ఈ పాట మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందంటున్నారు మేకర్స్.
సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను ఆయన రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చరణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంకర్.
నటీ నటులు:
రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శంకర్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
రైటర్స్: ఎస్.యు.వెంకటేశన్, వివేక్
స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్
కో ప్రొడ్యూసర్: హర్షిత్
సినిమాటోగ్రఫీ:ఎస్.తిరుణావుక్కరసు
మ్యూజిక్: తమన్.ఎస్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహారావ్.ఎన్, ఎస్.కె.జబీర్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల
యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్బరివు
డాన్స్ కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: షామీర్ ముహ్మద్
సౌండ్ డిజనర్: టి.ఉదయ్‌కుమార్