నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ “ఖుషి”.*

0
225

 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి…ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించింది ఖుషి. విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఈ నెల 1న ఖుషి సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టాప్ 1గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది.టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here