‘నీతోనే నేను’ మూవీ రివ్యూ

0
585

చిత్రం: నీతోనే నేను

నటీనటులు: వికాస్ వశిష్ట, కుషిత కళ్ళపు, మోక్ష, ఆకెళ్ళ తదితరులు

బ్యానర్: శ్రీ మామిడి ఎంటర్టైన్మెంట్

సంగీతం: కార్తీక్

సినిమాటోగ్రఫీ: మురళి మోహన్

కథ, నిర్మాత: ఎమ్. సుధాకర్ రెడ్డి

దర్శకత్వం: అంజి రామ్

హీరో టీచర్ గా చేసే సినిమాలు ఇప్పట్లో చాలా అరుదు. టీచర్ పాత్రలో హీరో ఆదర్శాలు, అతని వ్యక్తిగత జీవితంలోని ఆటంకాలు కలిసిన సినిమానే ‘నీతోనే నేను’. స్వతహాగా టీచ‌ర్‌గా ప‌ని చేసిన ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి త‌ను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని ఈ మూవీ క‌థ‌ను త‌యారు చేయడమే కాకుండా  శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.  అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.  సినిమా బండి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన వికాష్ వ‌శిష్ట క‌థానాయ‌కుడిగా న‌టించారు. కుషిత క‌ళ్ల‌పు, మోక్ష క‌థానాయ‌కులుగా అల‌రించారు. అక్టోబ‌ర్ 13న థియేటర్ లలో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ‌:

రామ్ (వికాస్ వ‌శిష్ట‌) ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచర్. తన విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడే రామ్ నిబద్ధతను చూసి కొందరు అసూయ పడితే మరికొందరు ఇష్టపడతారు. అలా రామ్‌ను చూసి అదే స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌గా ప‌నిచేసే ఆయేషా (కుషిత క‌ళ్ల‌పు) తనని ప్రేమిస్తుంది. ఓ రోజు ఆయేషా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను రామ్‌కు చెప్పగా, రామ్ త‌న‌కు పెళ్లైంద‌ని, చిన్న‌నాటి స్నేహితురాలే సీత (మోక్ష‌)ని పెళ్లి చేసుకున్న‌ట్లు చెబుతాడు. ఓ రోజు రామ్‌, సీత‌ల‌ను ప‌ల‌క‌రిద్దామ‌ని వారింటికి వెళ్లిన అయేషా కి షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఇంత‌కు రామ్ గురించి ఆయేషాకు తెలిసే నిజం ఏంటి? రామ్ జీవితంలో ఉన్న స‌మ‌స్య ఏంటి? సీత‌కు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి? త‌న స్కూల్‌లోని పిల్ల‌ల కోసం రామ్ చేసే ప‌నేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు:

‘సినిమా బండి’ తో మెప్పించిన వికాస్ వ‌శిష్ట భిన్న పార్శ్వాలు ఉన్న పాత్రలో మెప్పించారు. ఓ వైపు గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌గా, మ‌రో వైపు భార్య కోసం ప‌రిత‌పించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. కుషిత క‌ళ్ల‌పు లుక్స్ పరంగా చూడటానికి చ‌క్క‌గా ఉంది. ఎమోష‌న‌ల్ పాత్ర‌లో మోక్ష బాగా నటించింది. క‌న్నింగ్ టీచ‌ర్ పాత్ర‌లో ఆకెళ్ల న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ మంచి విజువ‌ల్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ అందించిన పాట‌లు ఎక్కడో విన్నట్టున్నా బావున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాత సుధాక‌ర్ రెడ్డి క్వాలిటీ తగ్గకుండా మంచి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమాను రూపొందించారు.

విశ్లేష‌ణ‌:

తన వృత్తి పట్ల నిబద్ధత కలిగిన టీచర్ జీవితంలో అనుకొని సంఘటనలు జరిగితే తను ఎలా ప్రభావితం అయ్యాడు అనే పాయింట్ ను బాగా డీల్ చేశారు. అలాగే చాలా చోట్ల గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లో చ‌దివే పిల్ల‌ల‌కు మంచి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తే వాళ్లు కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్ల‌ల‌కు ధీటుగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అంజిరామ్ తెర‌కెక్కించిన తీరు బావుంది. ఓ వైపు మెసేజ్‌తో పాటు మంచి ల‌వ్ స్టోరీని మిక్స్ చేసి తెర‌కెక్కించారు. క‌థ‌ను స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళుతూ ఇంట‌ర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మ‌ధ్య ఇచ్చే ట్విస్ట్ బావుంది. అయితే ఫ‌స్టాఫ్‌ను కాస్త సాగ‌దేసినట్లు ఉండటం, కథ లో సడెన్ గా కమర్షియల్ సాంగ్ రావడం అవరోధాలు అనిపిస్తాయి.  సెకండాఫ్ లో ట్విస్టుల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. మెసేజ్ తో పాటూ లవ్ స్టొరీ కి థ్రిల్లింగ్ అంశాలు కథ చేయడం తో కథకు కొత్త లుక్ వచ్చింది. ట్విస్టు లతో చివరి వరకు ఆసక్తిగా నడిపారు.

ఒక గవర్నమెంట్ టీచర్, త‌న‌కు వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో థ్రిల్లింగ్ గా చూపించింది ‘నీతోనే నేను’

రేటింగ్: 3/5

చివరగా: మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here