మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను మూవీ రివ్యూ

0
613

టైటిల్: మధురపూడి గ్రామం అనే నేను
రచన-దర్శకత్వం: మల్లి,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్
విడుదల తేదీ: అక్టోబరు 13, 2023

`అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠ‌మ‌నేని హీరోగా భ‌ద్రాద్రి, క‌త్తి చిత్రాల ద‌ర్శ‌కుడు మల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించింది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ:

మధురపూడి అనే ఊరు తన ఆత్మకథ చెబుతుంది. ఈ ఊరిలో సూరి (శివ కంఠమనేని) అనే మొండోడు. తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వ‌ర‌కైనా నిలబడతాడు. తన ఫ్రెండ్ మంచి కోసం ప్రాణాలిచ్చేందుకైనా, తీసేందుకైనా ఏమాత్రం వెనకాడ‌ని మనస్తత్వం. ఒక ర‌కంగా చెప్పాలంటే క‌ర్ణుడు, ధుర్యోదనుడు లాంటి క్యారెక్ట‌ర్స్‌. త‌న స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇవ్వ‌గ‌లిగే సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) ఎలా వస్తుంది?  ఆమె వచ్చాక సూరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఊర్లోని రాజకీయాలకు సూరికి సంబంధమేంటి? అస‌లు ఈ క‌థ‌కు 700 కోట్ల రూపాయ‌ల డిజిట‌ల్ స్కామ్‌కు సంబంధం ఏంటి? చివరికి బాబ్జీ సూరి స్నేహబంధం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ

నటీనటుల పనితీరు:

ఇది రెగ్యుల‌ర్ హీరోలు చేయ‌గలిగే క్యారెక్ట‌ర్ కాదు..క‌చ్చితంగా ఇలాంటి క‌థ‌లు కొత్త న‌టీన‌టులు చేస్తేనే ఆ మూడ్ క్యారీ అవుతుంది. ఈ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా సూరి పాత్రలో శివ కంఠ‌మ‌నేని చక్కగా నటించాడు. అన్నిరకాల ఎమోషన్స్‌ని బాగా చేశాడు.కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో పాటుగా యాక్షన్ సన్నివేశాల్లోనూ అద‌ర‌గొట్టాడు.  సూరి కారెక్టర్‌కు శివ కంఠమనేని ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనేలా న‌టించారు. హీరోయిన్ క్యాథ‌లిన్ గౌడ త‌న వ‌య‌సుకి మించిన పాత్ర చేసినా లుక్స్ పరంగా ఆకట్టుకుంది. త‌న‌కి చివ‌రి 30 నిమిషాలు న‌ట‌న‌కి మంచి స్కోప్ ద‌క్కింది. క‌థ‌లో కీల‌క‌మైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు కూడా బాగుంది. భ‌ర‌ణిశంక‌ర్ త‌న ప‌రిదిలో న‌టించి త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. వ‌నితా రెడ్డి, జ‌బ‌ర్‌ద‌స్త్ నూక‌రాజు, మ‌హేంద్ర‌న్ వారి వారి పరిది మేర న‌టించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

మణిశర్మ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ అని చెప్పొచ్చు. సురేశ్ భార్గవ్ విజువ‌ల్స్ చక్కగా ఉన్నాయి. ప‌ల్లెటూరి అందాలు ఎంతో సహజంగా తెరకెక్కించారు. తక్కువ నిడివితో ప్రేక్షకుడ్ని బోర్ కొట్టించకుండా క్రిస్ప్ గా ఉండేలా చూశారు ఎడిటర్ గౌతంరాజు గారు. ఇక నిర్మాతలు కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్ పెట్టిన ప్ర‌తి రూపాయి తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా క్వాలిటీ గా రావడానికి దోహదపడ్డాయి.

విశ్లేషణ:

ఓ కథలో రివేంజ్, పొలిటికల్, లవ్, యాక్షన్ డ్రామాను యాడ్ చేయడం.. కమర్షియల్‌గా అన్ని అంశాలను కలగలపి తీయడం మామూలు విషయం కాదు. అన్ని అంశాలను జోడిస్తూనే సమాజానికి ఏదైనా సందేశాన్ని ఇవ్వడం మరింత కష్టం. కానీ ఈ చిత్రంతో దర్శకుడు అన్నిటినీ సమతూకంలో వేసి చేసిన ప్రయత్నం స‌క్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. అన్ని కారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చిన  తీరు ప్ర‌శంస‌నీయం. క్యారెక్ట‌ర్స్ రిజిస్ట‌ర్ అవ్వ‌డానికి కాస్త టైమ్ ప‌ట్ట‌డంతో ప్ర‌థ‌మార్ధం నిదానంగా సాగినట్టు అనిపించినా.. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆ లోటుకి తీర్చుతుంది. ముఖ్యంగా ఎల్లే గోరింక పాట ఫ‌స్టాఫ్‌లో హైలైట్ కాగా లింగా లింగా పాట సెకండాఫ్‌ని న‌డిపిస్తుంది. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో హీరో పర్ఫామెన్స్, దర్శకుడు పని తీరు మెప్పిస్తుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా దర్శకుడు చేయడంలో సక్సెస్ అయ్యారు.

రేటింగ్ః 3/5

చివ‌ర‌గా: మ‌ధుర‌పూడిగ్రామం అనే నేను..ఆకట్టుకునే ఊరి కథ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here