స్టార్ డైరెక్టర్ పరశురామ్ గారి చేతుల మీదుగా రామ్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ రిలీజ్ చేయడం జరిగింది

0
159

నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే బాటలో వెళుతూ దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

స్టార్ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతోంది. హీరో డైలాగ్ డెలివరీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఈ సీన్ షూట్ చేసిన లొకేషన్ హీరో పవర్ ఫుల్ డైలాగ్‌కి యాప్ట్ అయ్యేలా ఉంది. మొత్తంగా చూస్తే ఈ గ్లింప్స్ సినిమా స్థాయిని కళ్ల ముందు కదలాడించిందని చెప్పుకోవచ్చు. ఇక రామ్ (RAM- రాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌) టైటిల్ మధ్యలో కనిపిస్తున్న అశోక చక్రం ఈ మూవీ రేంజ్ ఏంటో చెబుతోంది. ఈ టైటిల్ లుక్ తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.

 

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.

 

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ

నిర్మాత: దీపికాంజలి వడ్లమాని

బ్యానర్స్: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్‌ యం విజన్‌

సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్

సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రే డిఎసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here