టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ వైపు స్టార్ హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తూనే, మరోవైపు పలు డబ్బింగ్ చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సెప్టెంబర్ 22న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో రక్షిత్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని తెలియజేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.
The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰
Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/sWIXQwPXyH
— BA Raju's Team (@baraju_SuperHit) September 15, 2023
చిత్రం : సప్త సాగరాలు దాటి
నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల



