ఘనంగా జరిగిన ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” సినిమా టీజర్ రిలీజ్ వేడుక

0
127

“బేబీ” సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “గం..గం..గణేశా”. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న”గం..గం..గణేశా” సినిమా టీజర్ ను ఇవాళ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, విరూపాక్ష కార్తీక్ దండు, మిడిల్ క్లాస్ మెలొడీస్ డైరెక్టర్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

యాక్టర్ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. కామెడీ పంచ్ లు అదిరిపోతాయి. ఆనంద్ అన్నను ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. మీరంత ఫ్యామిలీతో కలిసి రెండున్నర గంటలు హ్యాపీగా చూసేలా సినిమా ఉంటుంది. అన్నారు

యాక్టర్ సత్యం రాజేష్ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఆనంద్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్ట్ ఈవెంట్స్ లో ఈ సినిమా గురించి మాట్లాడుతాను. అన్నారు

సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ ఉదయ్ ఎంత ప్యాషనేట్ గా మూవీ రూపొందించాడో మీకు టీజర్ లోనే కనిపిస్తుంది.
ఈ కథకు నేను మ్యూజిక్ తో న్యాయం చేయగలను అని నమ్మినందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చాననే అనుకుంటున్నాను. సినిమా కోసం ఆనంద్ దగ్గర నుంచి అందరం ఒక టీమ్ లా ప్యాషనేట్ గా కష్టపడ్డాం. అందుకు మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇవాళ థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించాలంటే ఛాలెంజింగ్ కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాాం అన్నారు.

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – మేమంతా ఒక మంచి సినిమా చేశామని చెప్పగలను. దర్శకుడు ఉదయ్ మాకు కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో స్టోరీ ఓకే అయ్యింది. మా అందరికీ అంత బాగా కథ నచ్చింది. ఆ కథను అంతకంటే అందంగా తెరకెక్కించారు. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వంశీ కారుమంచి మాట్లాడుతూ – మీరంతా టీజర్ చూశారు. టీజర్ ఎంత ఎనర్జిటిక్ గా, కామెడీగా ఉందో మూవీ కూడా అంతే యాక్షన్ కామెడీతో ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్స్ గా మాకు, డైరెక్టర్ ఉదయ్ కు ఫస్ట్ మూవీ. మేము ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన ఆనంద్ కు థాంక్స్. ఆనంద్ ఇప్పటిదాకా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా కొత్తగా ప్రయత్నించాడు. “గం..గం..గణేశా” సినిమా మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ ఇయర్ ఆనంద్ కు సెకండ్ సూపర్ హిట్ అవుతుంది. నిజానికి ఈ వినాయక చవితికే సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఈ ఇయర్ ఎండ్ కు “గం..గం..గణేశా” తెరపైకి తీసుకొస్తాం. అన్నారు.

మిడిల్ క్లాస్ మెలొడీస్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ – ఆనంద్, ఉదయ్, ఇక్కడున్న మిగతా ఫ్రెండ్స్ అంతా రెగ్యులర్ గా కలుస్తుంటాం. “గం..గం..గణేశా” సినిమా సెట్ కు వెళ్లి షూటింగ్ చూసేవాడిని. చాలా ప్యాషనేట్ టీమ్ ఇది. టీజర్ ఎగ్జైటింగ్ గా ఉంది. సినిమా ఎప్పుడు చూడాలా అనే ఆసక్తి కలుగుతోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ – డైరెక్టర్ ఉదయ్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. కొన్ని కథలు నాకు చెప్పాడు. ఈ మూవీ చాలా బాగుంటుంది. టీమ్ అంతా కష్టపడ్డారు. బేబితో రీసెంట్ హిట్ అందుకున్న ఆనంద్ కు మరో విజయం ఈ సినిమా ఇస్తుందని కోరుకుంటున్నా. అన్నారు.

“గం..గం..గణేశా” డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – మన లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో క్రేజీ క్యారెక్టర్స్ చూస్తుంటాం. అలాంటి క్రేజీ క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఆనంద్ లాంటి హీరో దొరికితే డెబ్యూ డైరెక్టర్ కు ఎంత కంఫర్ట్ గా ఉంటుందో నేను ఈ సినిమాతో ఎక్సీపిరియన్స్ చేశాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా ఎలాంటి స్ట్రెస్ మాకు ఇవ్వకుండా సినిమాకు కావాల్సినవి ఇచ్చారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ..ఇలా అన్ని క్రాఫ్ట్స్ లో మంచి టీమ్ కుదిరింది. వినాయక చవితి చుట్టూ తిరిగే కథ ఇది. వినాయక చవితి పండుగను మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ – ఈ మధ్య అసిస్టెంట్ డైరెక్టర్స్ కథ రాసుకున్న తర్వాత ఏ హీరోకు అని అడిగితే ఆనంద్ దేవరకొండ అని చెబుతున్నారు. ఆయన మొదటి సినిమా దొరసాని నుంచి బేబి వరకు సెలెక్ట్ చేసుకునే సినిమాలు అంత వర్సెటైల్ గా ఉంటున్నాయి. ఆనంద్ కొత్త టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తున్నారు. క్రైమ్ కామెడీస్ ఎప్పుడూ బాగుంటాయి. అప్పట్లో క్షణక్షణం, ఆ తర్వాత స్వామి రారా మనల్ని ఆకట్టుకున్నాయి. “గం..గం..గణేశా” కూడా ఆ స్టాండర్డ్ లో ఉండి ఇంప్రెస్ చేస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – ఏ డైరెక్టర్ కైనా ఫస్ట్ మూవీ టీజర్ చాలా ఎగ్జైట్ చేస్తుంటుంది. మాతో పాటు వచ్చిన డైరెక్టర్ ఉదయ్. ఈ సినిమాతో అడుగుపెడుతున్నాడు. ఉదయ్ కు “గం..గం..గణేశా” పెద్ద హిట్ ఇవ్వాలి, అతను పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఖుషి చేస్తున్న టైమ్ లో విజయ్ ను కలిసేందుకు వాళ్లింటికి వెళ్లిన ప్రతిసారీ ఆనంద్ మీట్ అయ్యేవాడు. చాలా స్వీట్ పర్సన్. ఆయన్ను చూస్తే ఎంతో పాజివిట్ గా అనిపించేది. బేబి మూవీ చివరి సీన్స్ చూశాక ఆనంద్ లో ఇంత మెచ్యూర్డ్ యాక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోయా. గత ఏడేనిమిది ఏళ్లలో నేను అలాంటి పర్ ఫార్మెన్స్ చూడలేదు. అందుకే కొత్త డైరెక్టర్స్ ఆనంద్ తో ఇంత స్మూత్ గా సినిమాలు చేయగలుగుతున్నారు. నా ఫేవరేట్ డైరెక్టర్ అనుదీప్ ను ఇక్కడ కలిసినందుకు హ్యాపీగా ఉంది. “గం..గం..గణేశా” టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – బేబి సినిమా రిలీజై రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల్లో బేబి సినిమాకు మీరిచ్చిన లవ్ మర్చిపోలేను. మీరు ఆ సినిమాను ఎంతో దూరం తీసుకెళ్లారు. బేబిలో ఎంత ఎమోషనల్ అయ్యారో “గం..గం..గణేశా” లో అంత ఎంటర్ టైన్ అవుతారు. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూర్స్ తో పనిచేస్తున్నా. నేను ఈ టీమ్ లో కొంత ఎక్స్ పీరియన్స్ ఉన్న వాడిని. ఫన్, క్రైమ్, యాక్షన్ వంటి అంశాలతో మిమ్మల్ని ఆకట్టుకునే మూవీ ఇది. ఈ సినిమా సూపర్బ్ గా ఉంటుంది. కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాం. రేపు థియేటర్ లో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. బేబి, ఈ సినిమా రెండు ప్యారలల్ గా చేశాను. కొన్నిసార్లు నిరాశగా అనిపించేది. కొన్నిసార్లు మోటివేటెడ్ గా అనిపించేది. అన్ని సందర్భాల్లో డైరెక్టర్ ఉదయ్ స్ట్రాంగ్ గా ఉండేవాడు. హీరోగా ఇది నాకు ఆరో సినిమా. ఇందులో నలుగురు కొత్త దర్శకులు నాతో ఇండస్ట్రీకి వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. మెలొడీ, ర్యాప్ సాంగ్స్..ఇలా సాంగ్స్, బీజీఎం అదిరిపోతాయి. కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు మూవీకి ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. వంశీ, కేదార్ బిగ్ ప్రొడ్యూసర్స్ అవుతారు. భయం, అత్యాశ, కుట్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంటుంది. సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరి ప్లాన్స్ తో వారు ఉంటారు. రేసీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూస్తారు. నా గత చిత్రాలతో చూస్తే చాలా డిఫరెంట్ మూవీ ఇది. నేను కథను నమ్మే సినిమా సెలెక్ట్ చేసుకుంటా. కొత్త వాళ్లైనా, ఎక్సీపిరియన్స్డ్ డైరెక్టర్స్ అయినా హిట్స్, ఫ్లాప్స్ ఇస్తారు. కానీ ప్రతి దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది. నేను దాన్ని నమ్మి సినిమా చేస్తాను. “గం..గం..గణేశా” బేబి సినిమా కలెక్షన్స్ దాటేస్తుందని..అలాంటి లెక్కలు వేసుకోలేదు. ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంటుంది. అన్నయ్య విజయ్ తో ఫ్యూచర్ లో కలిసి సినిమా చేస్తానేమో చూాడాలి. ఇప్పటికైతే అలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదు. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here