ఒకప్పుడు స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ విజయ భాస్కర్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా జిలేబి. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో విజయ భాస్కర్ తన కొడుకు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఆసక్తికరమైన కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.ఈ సినిమా ఎలా ఉందంటే..
కథ
జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడికి జి లక్ష్మి భారతి అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్)తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం వల్ల కొన్ని కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. జిలేబి రహస్యంగా అబ్బాయిల హాస్టల్‌లోకి ప్రవేశించగా ఆమె పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండవలసి వస్తుంది. దీంతో ఆమె ఆమె కమల్ సహాయాన్ని కోరగా బుజ్జి (సాయి కుమార్ బబ్లూ), బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ)లు కూడా ఆమె హాస్టల్ లో ఉన్నట్టు కనిపెడతారు. ఈ క్రమంలో జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి.. ఈ హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేశాడు? చివరికి ఆమె ఎలా బయటకు వచ్చింది అనేది సినిమా కథ.
నటీనటుల పనితీరు:
విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్.. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడ్డాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ తన ఏజ్‌కు తగ్గ పాత్రలో అందంగా కనిపించింది. నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారు అంతా కూడా ఆకట్టుకున్నారు.
హైలైట్స్:
శ్రీ కమల్, శివాత్మిక
కామెడీ సీన్స్
సెకండ్ హాఫ్
డ్రా బ్యాక్స్ :
మెల్లగా సాగే ప్రారంభ సన్నివేశాలు
విశ్లేషణ :
విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తన మార్క్, స్టైల్‌తో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపించినా.. బాయ్స్ హాస్టల్‌లోకి హీరోయిన్ వచ్చి ఉన్న దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.
మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. యూత్‌కు మెచ్చేలా డిజైన్ చేసుకున్న తీరు బాగుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయం వరకే ఉంచిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలోనే చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు నవ్వులు పుట్టిస్తాయి. కధతో ప్రేక్షకలను అలరించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. యూత్ ను బేస్ చేసుకుని చేసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ, మాటలు అన్నీ కూడా సినిమాకు ప్లస్సుగా మారాయి. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువల ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 3/5
చివరగా: నవ్వులు పూయించిన జిలేబి