రాజుగారి కోడిపులావ్ మూవీ రివ్వూ

0
561

చిత్రం: రాజుగారి కోడిపులావ్

నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు

బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా

నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన

డైరెక్టర్ : శివ కోన

సంగీతం : ప్రవీణ్ మని

సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు

ఎడిటర్ : బసవా- శివ కోన

సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు

వీఎఫ్ ఎక్స్ : విష్ణు పడిలోజు

సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్

రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన

పీఆర్ఓ : హరీష్, దినేష్

విడుదల: 04-08-2023

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించి, శివ కోన స్వియ దర్శకత్వం వహించగా, ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. టైటిల్ మొదలు, ఆసక్తి రేపే ప్రచార చిత్రాలు, ట్రైలర్ తో ఆకర్షించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న థియేటర్లో విడుదల అయింది. ఏ సర్టిఫికెట్ తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

రాజుగారు (ప్రభాకర్) ఒక హోటల్ ను నడుపుతూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. దానికి రాజుగారి కోడిపులావ్ అనే పేరు పెట్టి పైకి ఎంతో సంతోషంగా ఉన్నా నిజాకి అతను సంతోషంగా ఉండడు. కారణం తనకు కొడుకు పుట్టలేదని, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తిగా ఉన్న సమయంలో అతను ఒక ప్రమాదానికి గురి అయి తన రెండు కాళ్లను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే చాలా కాలం తరువాత కలిసిన కొంద మంది ఫ్రెండ్స్ ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అందులో డ్యాని (శివ కోన) క్యాండీ (ప్రాచి కెథర్) ఒక పెయిర్, అలాగే ఆకాంక్ష (నేహా దేష్ పాండే) బద్రి (కునాల్ కౌశిక్) భార్యభర్తలు. ఫారుఖ్ (అభిలాష్ బండారి) ఈషా (రమ్య దినేష్) భార్యభర్తలు. రోడ్ ట్రిప్ కు వెళ్లిన ఈ మూడు జంటలు కారు బ్రేక్ డౌన్ వలన అడవిలో తప్పిపోతారు. ఈ లోగా క్యాండీ మరణించడం, ఈషా కనిపించకుండా పోవడం మిస్టరీ గా మారుతుంది. అలా తిరుగుతున్న వారు ఫైనల్ గా అడవిలో ఒక ఇంట్లోకి వెళ్తారు. అసలు క్యాండి, ఈషా లకి ఏం అయింది.? రాజుగారికి ఈ ముగ్గురు జంటలకు సంబంధం ఏంటీ? వరుస హత్యలు ఎందుకు జరిగాయి.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాలి.

నటీనటుల పనితీరు:

యాక్టర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించిన శివ కోన అన్నిటినీ సమర్థవంతంగా చేశారు. డ్యాని క్యారెక్టర్లో ఉన్న షెడ్స్ ను ఆకట్టుకునేలా తెరపైన పండించారు. ఒక పక్క కూల్ గా ఉంటూ కామెడీ చేస్తూనే మరో పక్క థ్రిల్  ఫీల్ అయ్యేలా చేశారు. ప్రాచీ థాకర్ తన పాత్ర గుర్తుండేలా మెచ్యుర్డ్ ఫర్ఫార్మెన్స్ చేసింది. అభిలాష్ బండారి ఫారూఖ్ పాత్రలో హ్యండ్ సమ్ గా కనిపించారు. తన యాక్టింగ్ కూడా డిసెంట్ గా అనిపిస్తుంది. నేహా దేష్ పాండే తన రోల్ కు పూర్తి న్యాయం చేసింది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలో  ఆకాంక్ష ఆకట్టుకుంది. కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో బాగా చేశారు. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక ఫైనల్ గా రాజుగారి గా ఈటీవి ప్రభాకర్ కనిపించింది కాసేపే అయినా తన ఎక్స్పీరియన్స్ తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

హైలైట్స్

సినిమా థీమ్, కథనం

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో బ్యాక్ స్టోరీ

శివ కోన యాక్టింగ్

ట్విస్ట్ లు

ప్రమోషన్స్

డ్రాబ్యాక్స్:

అక్కడక్కడ స్లో గా అనిపించే ఫస్ట్ హాఫ్

కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించుంటే ఇంకా బాగుండేది

సాంకేతిక నిపుణుల పనితీరు:

డైరెక్టర్ శివ కోన వన్ మ్యాన్ షో. తనకు తొలి సినిమానే అయినా ఎక్కడా కూడా కొత్తవాడు అన్న ఫీలింగ్ రాదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా హేండిల్ చేయాలో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తూ సినిమాను గ్రిప్పింగ్ గా  నడిపారు. ఫన్, థ్రిల్లింగ్ అంశాలను మిక్స్ చేయడం అనే రేర్ ఫీట్ లో సక్సెస్ అయ్యారు. ఇక సినిమాకు ప్రాణం అయిన మ్యూజిక్ ను అందించిన ప్రవీన్ మణీ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఉత్కంఠబరితమైన సన్నివేశాల్లో తన ప్రతిభను కనబరిచారు. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త షార్ప్ గా కట్ చేసింటే బాగుండేది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. చాలా వరకు నేచురల్ గా చిత్రీకరించారు.

విశ్లేషణ:

రాజుగారి కోడిపులావ్ హోటల్ మీదుగా కథ ప్రారంభం అవుతుంది. మిత్ర బృందం పరిచయం, వారి మధ్య రిలేషన్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా కూల్ గా సాగిపోతుంది. కథ  అడవిలోకి ఎంటర్ అయిన తరువాత సినిమాలోకి టెన్షన్ వాతావరణం వస్తుంది. చూసే ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఏర్పడుతుంది. అడవిలో జరిగే సంఘటనలు ఆసక్తిని పెంచుతాయి. ఒక ఇంటరెస్టింగ్ ట్విస్ట్ తో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.

సెకండ్ హాఫ్ లో అదే ఆసక్తి కంటిన్యూ అవుతుంది. నెక్ట్స్ ఏం జరుగుంది అనే క్యూరియాసిటి జెనరేట్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. అసలు కథ ను రివీల్ చేసిన తీరు మెప్పిస్తుంది. కథకు, రాజుగారికి ఉన్న కనెక్షన్ ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ చాలా ఆసక్తిగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎక్స్ పిరయన్స్ తో సినిమా ఎండ్ అవుతుంది.

రేటింగ్: 3/5

చివరగా: ఫన్ & థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే ‘రాజుగారి కోడి పలావ్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here