చిత్రం: మిస్టేక్
నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఏఎస్‌పీ మీడియా హౌస్
నిర్మాత: అభినవ్ సర్దార్
స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి
సంగీతం: మణి జెన్నా
సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి
ఎడిటర్:విజయ్ ముక్తావరపు
విడుదల తేది: ఆగస్ట్ 4, 2023
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆద్యంతం ఆకట్టుకునేలా చిత్రాలు నిర్మిస్తే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ‘రామ్ అసుర్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ సర్దార్ నిర్మాతగా మారి నటించి, నిర్మించిన చిత్రం మిస్టేక్. ఈ చిత్రంలో అభినవ్ ఓ ముఖ్య పాత్రను పోషించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నేడు (ఆగస్ట్ 4) ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మిస్టేక్ ఎలా ఉందో చూద్దాం.
కథ:
మిస్టేక్ సినిమా మూడు జంటల చుట్టూ తిరుగుతుంది. అగస్త్య (బిగ్ బాస్ అజయ్) – మిత్ర (ప్రియ), కార్తీక్ (తేజ ఐనంపూడి) – స్వీటీ (తానియ కల్ల్రా), దేవ్ (సుజిత్ కుమార్) – పారు (నయన్ సారిక) జంటల ప్రేమ కథల్లో అందరూ హ్యాపీగా సమయం గడిపేస్తున్న క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇబ్బంది ఏర్పడడంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా తమ ప్రియురాళ్లను తీసుకుని జంగిల్ కి వెళ్తారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో అనుకోని సమస్య ఏర్పడుతుంది ఆ సమస్య నుంచి ఈ మూడు జంటలు తప్పించుకుని అడవిలోకి వెళ్ళారా? వెళ్ళాక అక్కడ వారికి ఎదురైన సమస్యలేంటి? వీరిని వెంబడిస్తున్న అభినవ్ సర్దార్ ఎవరు? ఆ వ్యక్తికి ఈ మూడు జంటలకు సంబంధం ఏంటి? ఇందులో రాజా రవీంద్ర, సమీర్‌ల పాత్రలు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు:
దేవ్ పాత్ర నవ్వించేలా , అగస్త్య పాత్ర స్టయిలీష్‌గా ఉండగా కార్తిక్ పాత్రధారి తేజ అమాయకుడిగా ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గరి కాంబోలో ఉండే సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. ప్రియ, తానియ, నయన్ తమ తమ పాత్రల్లో పరిధి మేరకు నటించారు. తమ గ్లామర్ డోస్ తో ఆకట్టుకుంటారు. ఈ మూడు జంటలు తెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. నిర్మాతగా సినిమా నిర్మించి కిల్లర్ పాత్రలో కనిపించిన అభినవ్ సర్దార్ పాత్ర సినిమా మొత్తం మీద హైలైట్. ఆయన సీన్లు భయపెడతాయి. విలన్‌గా అభినవ్ సర్దార్ అందరినీ ఆకట్టుకుంటాడు. రాజా రవీంద్ర, సమీర్‌లతో పాటుగా మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.
హైలైట్స్:
అభినవ్ సర్దార్ నటన
మూడు జంటల మధ్య కెమిస్ట్రీ
హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్
ట్విస్టులు, యాక్షన్ సీన్స్
డ్రాబ్యాక్స్:
కథ, కథనాలను మరింత బలంగా ఉండుంటే మరింత బాగుండేది
యావరేజ్ సాంగ్స్
సాంకేతిక నిపుణుల పనితీరు:
మణి అందించిన పాటలు మరింత బాగుండల్సింది . కానీ బిజీఎం మాత్రం అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి కెమెరా పనితనం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. అడవి అందాలను, యాక్షన్ సీక్వెన్సులను బాగా క్యాప్ఛర్ చేశారు. మాటలు నవ్విస్తాయి. విజయ్ ఎడిటింగ్ షార్ప్‌గా అనిపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత అభినవ్ ఈ సినిమాను నిర్మించినట్టు కనిపిస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ తరహా సినిమాలు ఎక్కువయ్యాయి. మిస్టేక్ సినిమా కూడా ప్రారంభమైనప్పుడు రొటీన్ సినిమాలాగే అనిపిస్తుంది కానీ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమా మీద ఒక్కసారిగా ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మిస్టేక్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ప్రథమార్దంలో జరిగే సీన్లకు సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఆ లింక్స్‌ను డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు. ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు బలంగా నిలిచాయి. అవే సినిమా మీద ఇంప్రెషన్ ను క్రియేట్ చేస్తాయి.
ఫస్ట్ ఆఫ్ లో రొటీన్ సినిమానే కదా అనుకున్న వారందరూ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం చాలా ఎక్సైట్ అవుతారు. సినిమా పేరుకు జస్టిఫై చేస్తూ చిన్న మిస్టేక్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాంటి మిస్టేక్ చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తే కొన్నిసార్లు మాత్రం అదృష్టం తెచ్చి పెడుతుంది అన్న కోణంలో ఒక చిన్న లైన్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. మిస్టేక్ సినిమాలో దర్శకుడు ట్విస్టులతో పాటు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్ సీక్వెన్స్ బ్లాకులను డిజైన్ చేసుకున్నాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ నుంచి సస్పెన్స్ క్రియేట్ చేసి చివర్లో ట్విస్టులు రివీల్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోల్డ్ డైలాగులు యూత్ కి కనెక్ట్ చేసేలా ఉన్నాయి. అయితే ఒకానొక దశలో సినిమా లో రిపీటెడ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అభినవ్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అయితే చివర్లో సీక్వెల్ కోసం ఇచ్చిన హింట్, సీక్వెల్ కోసం రాసుకున్న పాయింట్ బాగుంటుంది. దీంతో రాబోయే ఆ సీక్వెల్ మీద ఆసక్తిని క్రియేట్ చేసినట్టు అయింది
సాంకేతికంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఆర్ఆర్ అందరినీ మెప్పిస్తుంది. కెమెరా వర్క్ గుర్తుండిపోతుంది. అడవి అందాలను, యాక్షన్ సీక్వెన్సులను బాగానే క్యాప్ఛర్ చేశారు. విజువల్స్ సహజంగా ఉంటాయి. మాటలు నవ్విస్తాయి. ఎడిటింగ్ షార్ప్‌గా అనిపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత అభినవ్ ఈ సినిమాను నిర్మించినట్టు కనిపిస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి
రేటింగ్: 3.25
చివరగా: థ్రిల్లర్ లవర్స్ ను అలరించే మిస్టేక్