“హే చెలి
అడిగాను కౌగిలి
తీయగా తీరాలి ఈ చలి..“
అంటూ ప్రేమికుడు తన మనసులోని ప్రేమను ప్రేయసికి చెబుతూనే ఆమెను కొంటెగా కవ్విస్తున్నారు. అసలు ఈ ప్రేమికులు ఎవరు? వారేం చేశారనే విషయాలు తెలియాలంటే `మిస్టర్ ప్రెగ్నెంట్`సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్స. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలలకు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. మంగళవారం ఈ సినిమా నుంచి `హే చెలి..` అనే ఆహ్లాదకరమైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మనసుని తాకే చల్లటి చిరుగాలిగా పాట అనిపిస్తుంది. విజువల్స్ ఆ ట్యూన్‌ను అనుగుణంగా అద్భుతంగా ఉన్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాటను శ్రీమణి రాశారు.
పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతోనే ఇలా వెరైటీగా ప్రమోషన్స్ ను డిఫరెంట్‌గా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది చిత్ర యూనిట్.
శ్రవణ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న నిజార్ షఫి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
A perfect love melody for the cool monsoon ❤️🔥❤️🔥#HeyCheli video song from#MrPregnant out now ❤️
– https://t.co/M25qo4jI9lIn cinemas on August 18th 💥@RyanSohel @RoopaKoduvayur @SVinjanampati @actorbrahmaji @Appireddya @SajjalaRavi @Mic_Movies @GskMedia_PR pic.twitter.com/cYzimT9ukD
— BA Raju's Team (@baraju_SuperHit) July 25, 2023
నటీనటులు :
సోహెల్, రూపా కొడవాయుర్, సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : మైక్ మూవీస్
నిర్మాతలు : అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి
కెమెరామెన్ : నిజార్ షఫి
సంగీతం : శ‌్రవణ్ భరద్వాజ్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : జీఎస్‌కే మీడియా



