నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి లేడీ లక్ అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేశారు.
లేడీ లక్ అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. కార్తిక్ ఆలపించారు. రధన్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు మేకర్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుదలకాబోతోంది.
ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటే..Unveiling the essence of love ❤️ https://t.co/nr0YdX7hgt
Here's a mesmerizing #𝑳𝒂𝒅𝒚𝑳𝒖𝒄𝒌 𝑭𝒖𝒍𝒍 𝒗𝒊𝒅𝒆𝒐 𝒔𝒐𝒏𝒈 from #MissShettyMrPolishetty😀#MSMPonAug4th@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh… pic.twitter.com/LimjO2ggei
— BA Raju's Team (@baraju_SuperHit) July 10, 2023
నటీనటులు:
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి
సాంకేతిక బృందం
బ్యానర్: యువీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ – ప్రమోద్
రచన, దర్శకత్వం: మహేష్ బాబు.పి
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
కొరియోగ్రఫీ: రాజు సుందరం
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి