ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ రివ్యూ

0
498

చిత్రం: ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్

నటీ నటులు: నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్

డి. ఓ. పి : అమర్ దీప్

నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు

స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి

ఛార్మీ కౌర్ తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై వంటి హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ లను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ నుండి వచ్చిన మరో విభిన్న చిత్రం ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. లవ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కి నేడు థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

ఇన్యూరెన్స్ కంపనీలో పని చేసే రవి (నిహాల్ కోదాటి), డబ్బింగ్ ఆర్టిస్ట్ చరిత్ర (ద్రిషిక చందర్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. చరిత్ర ఉన్నత స్థితికి రావడానికి రవి తన జీవితాన్నే పణంగా పెడతాడు. ఓ ఈవెంట్ కు డ్యాన్సర్ గా సెలక్ట్ అవడంతో చరిత్ర లైఫ్ కు టర్నింగ్ పాయింట్. అదే ఈవెంట్ లో రవి స్నేహితుడు విక్రమ్ (సమర్ధ్ యోగి) పరిచయంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. ఒక రోజు చరిత్ర కనబడకుండా పోతుంది  . ఈ మిస్సింగ్ కేసును ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు చేపడుతారు. ఈ దర్యాప్తులో అనుకొని నిజాలు బయటకు వస్తాయి. అసలు విక్రమ్ ఎవరు, చరిత్రకు ఏం అయింది. రవికి, చరిత్రకు, విక్రమ్ లకు మధ్య సంబంధం ఏంటి… ఈ విషయాలను పోలీసులు ఎలా వెలికి తీశారు. ఈ కేసులో జర్నలిస్ట్ గా దేవి నాగవల్లి పాత్ర ఏంటి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరోగా నటించిన నిహాల్ కోదాటి తన పాత్రకు న్యాయం చేశారు. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరగడం వలన అన్ని రకాల భావోద్వేగాలను పలికించల్సిన అవసరం ఉంది. ఎమోషనల్ సీన్లలో తన హావభావాలను చాలా భాగా వ్యక్తపరిచారు. ఇక కథకు ప్రాణం అయిన చరిత్ర పాత్రలో యంగ్ హీరోయిన్ ద్రిషిక చందర్ చక్కగా సరిపోయింది. లవ్ సీన్లలో, ఎమోషనల్ సీన్లలో తన నటనతో మెప్పిస్తుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డ్యాన్స్ మూమెంట్ కూడా చాలా బాగా చేసింది. విక్రమ్ గా నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో యువ నటుడు సమర్థ్ యోగి బాగా చేశారు. అలాగే పోలీసు ఆఫీసర్ పాత్రలో నటుడు మధు నందన్ తన పాత్ర మేరకు మెప్పించారు. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఆదిత్య గా భార్గవ్ పోలుదాస్ కు మంచి మార్కులు పడతాయి. కేసును సాల్వ్ చేసే తీరులో ఆయన నటన అందరిని మెప్పించింది. అలాగే జర్నలిస్ట్ గా నటించిన ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగవల్లి కూడా తన పాత్ర పరిధిలో మెప్పించింది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాకు కథ, కధనం, మాటలు, దర్శకత్వం అందించిన రవి ప్రకాశ్ బోడపాటి సినిమాలో తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎఫెక్టివ్ఫ గా చెప్పగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేటివ్ గా సాగుతూ పారలల్ గా ప్రేమ కథను చూపించారు. ఇక సెకండ్ ఆఫ్ గ్రిప్పింగ్ నేరేషన్ ఉండేలా చూసుకున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండే కథను ఎంగేజింగ్ గా ఉండేలా చేయడంలో డెరెక్టర్ రవి ప్రకాశ్ బోడపాటి సక్సెస్ అయ్యారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. సంగీత దర్శకుడు అర్వీజ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన గిడియన్ కట్ట సస్పెన్స్ ను మెయింటైన్ చేసేలా బీ జీ ఎమ్ ను ఇచ్చారు. కొన్ని ఎమోషన్ సీన్లలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హాంటింగ్ గా ఉంది. సినిమాటో గ్రాఫర్ అమర్ దీప్ ఈ సినిమాకు మైయిన్ పిల్లర్. తన పనితనం తో థ్రిల్లింగ్ మూడ్ ను తీసుకొచ్చారు. ఎడిటర్ గా పనిచేసిన ప్రవీణ్ పూడి పనితనం మెప్పించింది. చిన్న సినిమా అయినా నిర్మాతలు ప్రసాద్ తిరువల్లూరి, పుష్మమి ధవళేవశ్వరపు లు ఎక్కడ కాంప్రమైజ్ అవలేదు. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

నేటి యువతరం ఆలోచనలు రిఫ్లెక్ట్ అయ్యేలా, వాస్తవ పరిస్థితులకు రిలేట్ అయ్యే కథతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాను తెరకెక్కించారు. సినిమా మొత్తం స్నేహం, లవ్, ఎమోషనల్ డ్రామాతో నడుస్తూనే నేడు ఆన్ లైన్ ఆధారంగా జరిగే ఓ పెద్ద స్కామ్ ను ఎక్స్ ప్లోర్ చేశారు. అలా ఆ స్కామ్ లో చిక్కిన అమ్మాయిలు ఎలా బాధ పడతారు, ఏ విధమైన ఎమోషనల్ డామేజ్ కి గురవుతున్నారు అనే అంశాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ థీమ్ కు సస్పెన్స్, లవ్ అంశాలను సమపాళ్లలో జోడించి దర్శకుడు కంప్లీట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు.

రేటింగ్: 3.25 / 5

చివరగా: రెలేటబుల్ కాన్సెప్ట్ తో ఎంగేజింగ్ గా సాగే రొమాంటిక్ థ్రిల్లర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here