ఏప్రిల్ 28 వ తేదీన మన పద్మశ్రీ, నటరత్న, కళాప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఒక భాగముగా శతజయంతి వేడుకలు ఎన్.టీ.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ వేడుకలను ఎన్.టీ.ఆర్. కుటుంబసభ్యులు, ప్రజలు, ఎన్.టీ.ఆర్. వంశ అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య ఎన్.టీ.ఆర్. శతజయంతి ఉత్సవాలు ఓ పండుగలాగా ఎన్.టీ.ఆర్. పుట్టిన కృష్ణ జిల్లా, విజయవాడ నగర బొడ్డున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు…..ఈ ఎన్.టీ.ఆర్. శతజయంతి ఉత్సవాలకు ఎన్.టీ.ఆర్. కుటుంభ సన్నిహితులు, శ్రేయోభిలాషి మన పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ పాల్కే గ్రహీత మన అన్న అన్ని భాషల్ల సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ గారిని ఆహ్వానించటం….వారెంత బిజీగా ఉన్న, ఎన్.టీ.ఆర్. శతజయంతి ఉత్సవాలకు ఒప్పుకొని రావటం జరిగింది. రజనీకాంత్ గారు మాట్లాడుతూ 1978 ఎన్.టీ.ఆర్.తో నటించిన టైగర్ సినిమా గుర్తుచేస్తూ…. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఎన్.టీ.ఆర్. మీదున్న ప్రేమానురాగాన్ని చాటిచెపుతూ ఎన్.టీ.ఆర్. ఒక యుగపురుషుడు, దైవస్వరూపుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్.టీ.ఆర్ మాదిరిగా ఉంటారని చెప్పారు. ఎన్.టీ.ఆర్. ఒక గొప్ప సినీ నటుడుతోపాటు మనిషిలో ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పారు. రజనీకాంత్ గారు వచ్చి ఈ పండుగ వాతావరుణములో పాలుపంచుకోనందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, కుటుంభసభ్యులందరు రజనీకాంత్ గారు వచ్చినందుకు వారి వారి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తంచేస్తూ రజనీకాంత్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకముగా ఎన్.టీ.ఆర్. గారి కుమారులు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, ఎన్.టీ.ఆర్. శతజయంతి ఉత్సావాళ్ళ కమిటీ చైర్మన్ టీ.డీ.జనార్దన్ గారు వారి వారి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
– నందమూరి రామకృష్ణ