ఆకట్టుకునే ఫస్ట్ లుక్ తో ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’

0
82
బెంగాల్ కు చెందిన ప్రియాంక త్రివేది 90వ చివరి దశకం నుండి 2000 తొలి నాళ్ళ వరకు అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్. ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర ను వివాహమాడి ప్రియాంక ఉపేంద్ర గా మారిన ఆవిడ, వివాహం తర్వాత కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా తనకు నచ్చిన క్యారెక్టర్ లను ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేశారు. కానీ తను ఎప్పుడూ సినిమాలకు దూరం కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆకట్టుకునే నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ‘డిటెక్టివ్ తీక్షణ’ గా తన 50వ చిత్రంతో మన ముందుకు రానున్నారు. మేకర్స్ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రియాంక ఉపేంద్ర గన్ పట్టుకుని టిపికల్ యాక్షన్ పోజ్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్, టైటిల్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తుండగా పొలకల చిత్తూర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్)  పురుషోత్తం బి (ఎస్ డి సి) నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here