కళా తపస్వి, పద్మశ్రీ,,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ కె . విశ్వనాధ్ గారు మరణించారన్న వార్త విని తట్టుకోలేకపోయాను అన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు డా. టి. సుబ్బరామిరెడ్డి.
దర్శకునిగా,రచయితగా, నటునిగా గొప్ప గుర్తింపు పొందిన మహా తపస్వి , కళా తపస్వి ఆయన. విశ్వనాథ్ గారు తన సినిమాల ద్వారా భారతీయ కళలు, సంస్కృతీ సంప్రదాయాలను, మనవైన సభ్యతను ఈ తరానికి అందించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, శంకరాభరణం, సాగర సంగమం తదితర చిత్రాలు అందుకు అద్దం పట్టాయని అన్నారు. సప్తపది,శుభసంకల్పం లాంటి చిత్రాలతో తరాలుగా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను రూపు మాపడం కోసం ప్రయత్నించార ని, కుల వ్యవస్థ, వరకట్నం, మూఢవిశ్వసాలు తదితర సామజిక సమస్యలను తన సినిమాల ద్వారా స్పశిస్తూ, సంస్కరిస్తూ వారు నేటి తరానికి గొప్ప సందేశం , విలువలతో తో కూడిన మార్పును అందించారని,
శ్రీ కె . విశ్వనాధ్ గారి మృతి తెలుగు సినీరంగానీకే గాక, తెలుగు ప్రజలకు సైతం తీరని లోటు అని వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆలగే వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలాన్ని తట్టుకునే శక్తి, ధైర్యాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు డా. టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు.