ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ లాంచ్

0
150

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా అనంత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి మధు బాబు దర్శకత్వం వహిస్తుండగా.. A ప్రశాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో అనీష్ కురువిళ్ళ, లయ సింప్సన్, శ్రీనివాస్ J గడ్డం, రమేష్.కే, అనిల్ కుమార్, కీర్తి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందిస్తున్నారు. సిద్దు సోమిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్ర యూనిట్ తాజాగా ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్థ చేతుల మీదుగా అనంత టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో సినిమా సోల్ ఏంటనేది స్పష్టమయ్యేలా ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. చిత్రంలో ఇన్వెస్టిగేషన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఈ టీజర్ ద్వారా ప్రేక్షకులకు తెలిపారు. ఈ వీడియోలో ఘంటసాల విశ్వనాధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సిద్దు సోమిశెట్టి డీఓపీ హైలైట్ అవుతున్నాయి.

ఇక ఈ టీజర్ చూసిన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ.. సినిమా చాలా బాగా వచ్చిందని అర్థమవుతోందని అన్నారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ సినిమా కాదని, డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేస్తూ ఈ అనంత రూపొందించారని తెలుస్తోందని అన్నారు. ఇందులో థ్రిల్లర్, మైథలాజికల్, సైకోలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తోందని.. నటీనటులు, టెక్నీకల్ టీమ్ అంతా కష్టపడి పని చేశారని స్పష్టమవుతోందని అన్నారు. ఇలాంటి సినిమాలను ఆదరించి ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరారు డైరెక్టర్ చంద్ర సిద్దార్థ.

చిత్ర దర్శకులు మధు బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాము. కథ వినగానే ప్రశాంత్ ముందుకొచ్చి ఈ సినిమా చేశారు. చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరి సహకారంతో మంచి అవుట్ పుట్ వచ్చింది. ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంతో పాటు నాలెడ్జ్ పంచుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్టుతో రాబోతోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

హీరో ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ గారికి స్పెషల్ థాంక్స్. మధు స్టోరీ చెప్పగానే వర్కవుట్ అవుతుందా అనుకున్నా. కానీ ప్రొసీడ్ అయ్యాక ఈ సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here