వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్.
ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచచింది. అతి తక్కువ వ్యవధిలోనే యూ ట్యూబ్ సహా అన్నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘హిట్ 2’ టీజర్ హల్ చల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజర్‌ను తొలగించి అందరికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొలగించింది. టీజర్ చూడటానికి వయోపరిమితి ఉండాలంటూ ఆంక్షలు విధించింది. టీజర్‌పై యూ ట్యూబ్ యాక్షన్ తీసుకునే లోపు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిపై హీరో అడివి శేష్ వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అసలేం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే టీజర్‌ను చూడాలనుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు.
ఇలాంటిది ముందే జరుగుతుందని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా సవ్యంగానే జరుగుతుందని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ స్వాగతించింది. అదే సమయంలో అడివి శేష్ తన వీడియోలో రేపు విడుదలవుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. గ్యారీ బి.హెచ్ ఈ చిత్రానికి ఎడిటర్.
#HIT2 teaser taken off from trending list on YouTube 🔻@AdiviSesh reacts!
– https://t.co/RbvIQhxEC5#UrikeUrike video song tomorrow at 11:07AM!#HIT2onDec2@NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @SVR4446 @walpostercinema @saregamasouth pic.twitter.com/ncTR5DwLKD
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2022