డిసెంబర్ 30న రాబోతున్న ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’

0
161

లవ్లీ హీరో ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సాయికుమార్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ ఆది సాయికుమార్ రీసెంట్‌గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం.

ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్.
ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్, దీపావళి సందర్భంగా విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆది సాయికుమార్‌కు జంటగా రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్ సర్వాలు సమకూర్చారు.

”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా” లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.

నటీనటులు
ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్

టెక్నీషియన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: రామాంజనేయులు
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here