జెట్టి మూవీ రివ్యూ

0
686

మూవీ : జెట్టి

రిలీజ్ డేట్: 04.11.2022

నటీనటులు : తేజశ్వని బెహెర, M.S. చౌదరి, మయం గోపి, జీవ,కిషోర్ కుమార్ జి, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, నందిత శ్వేతా, సుమన్ శెట్టి

సంగీతం : కార్తీక్ కొడకండ్ల

నిర్మాత : కే.వేణు మాధవ్

దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచుక

సముద్రపు వడ్డున జీవనం సాగిస్తూ సముద్రం లో చేపల వేటతో జీవనం సాగించే మత్యకారుల జీవన విధానం నేపథ్యం పై ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఈ మధ్యకాలంలో ఉప్పెన లా వచ్చిన ఉప్పెన సినిమా జాలర్ల జీవితాల కథతో పాటు యువ జంట ప్రేమ కథగా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అలా సముద్రాన్ని నమ్ముకున్నతీర ప్రాంత ఊరు కటారి పాలెం లోని జాలర సమస్యలు మీద జాలర్ల జీవన విదానం చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి” జెట్టి” సిద్ధమైంది.

మన్యం కృష్ణ, నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

సముద్ర తీర ప్రాంత ప్రజలు ప్రతి ఏటా తుపాను తాకిడికి తమ ఆస్తులు పోగొట్టుకొంటుంటారు. అలా కొన్ని గ్రామాల్లోని వేలాది మత్స్యకారుల కుటుంబాల తరతరాల పోరాటం, తమ జీవనోపాది అయిన పడవల రక్షణ, తమ కష్టానికి మార్కెట్ లో మంచి ధర…ఇలాంటి సమస్యలు తీర్చే ఒక రక్షణ గోడ పేరే జెట్టి. చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్నటువంటి ఊరి (కటారి పాలెం)లో జరిగిన కదే ఈ జెట్టి చిత్ర మూల కధ.

సముద్ర తీర ప్రాంత మైన కటారిపాలెం గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్‌ చౌదరి) ఊరికి పేద కాపు గా ఉంటూ కటారి పాలెం ను పరిరక్షిస్తూ ఉంటాడు. తరచూ బంగాళాఖాతం లో ఏర్పడే తుఫానుల కారణంగా ఆ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ కొట్టుకు పోయి ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతుంటాయి.

దాంతో ఎలాగైనా రక్షణ గోడ (జెట్టి) నిర్మించి తన గ్రామ మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య (శివాజీ రాజా) కి మొరపెట్టుకుంటారు. ఎంఎల్ఏ గా గెలవడానికి తమ ఊరు జనాలతో మద్దతు యిస్తాడు. ఎమ్మెల్యే గా గెలిచిన దశరథ రామయ్య పార్టీ ఓడిపోయి ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యేగా మిగలడం తో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని ఆ ప్రాంత చేపల వ్యాపారి (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు.

అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ… జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు కటారి పాలెం గ్రామ వదిలి పని మీద హైదరాబాద్ వెళ్తారు. ఊరి జనాలు మాత్రం శ్రీ, మీనాక్షీ లేచిపోయారు అని ప్రచారం చేస్తారు. ఇది విన్న ఊరి పెద కాపు జాలయ్య అవమానంగా ఫీల్ అయి ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం ఏమి చెయ్యాలా అని భాద పడుతుంటాడు.

జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని సాదించడానికి ఏమి చేశాడు ? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా బయటి వ్యక్తితో వెళ్లిపోయిన తన కూతురుని ఎం చేసాడు ? ఇంతకీ శ్రీ -మీనాక్షీ ప్రేమించుకున్నారా ? ఎందుకు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది ? జాలయ్య లేచిపోయింది అనుకొన్న తన కూతురు మీనాక్షీ ని ఏమి చేశాడు ? అనేదే జెట్టి సినిమా మిగతా కథ. ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి అంటే జెట్టి సినిమా చూడవలసిందే.

విశ్లేషణ:

భారత దేశం లోని అన్ని సముద్ర తీర ప్రాంత గ్రామాలలో, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాలు అన్నీ ఒకేల ఉంటాయి. ఇలాంటి పాయింట్ తోనే దర్శకుడు ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన‌ కట్టుబాట్లు, వారి జీవనశైలి, మ‌త్స్య‌కారులు పోరాటం చేసి జెట్టిని ఎలా సాధించారు అన్న‌దే ఈ సినిమా క‌థాంశం గా తీసుకొని అన్ని విశయాలకు కటారి పాలెం ఊరి ప్రజలు ఇతి వృత్తంగా కధను మాలిచాడు. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెన లాంటి రక్షణ గోడ ను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు.

అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి మత్య వ్యాపారి ఆ ప్రాంతాన్ని తన డబ్బు బలం తో ఎలా కంట్రోల్ చేస్తున్నాడో,అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఈ కధ లో ఎంతో భావోద్వేగం ఉంటుంది. కన్నకూతుళ్ల మధ్య ఉండే ఓ ఎమోషనల్ బాండింగ్‌ క్లైమాక్స్‌ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది.

జెట్టి సినిమా చూసే ప్రేక్షకుల గుండెను బరువెక్కించే సినిమా. జెట్టి అనే సినిమా ఉంది అని అందరికీ తెలియజేస్తే, తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నటి, నటుల పనితీరు:

గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి అన్నీ తానే అయి చాలా బాగా చేశాడు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు.

హీరోగా నటించిన కృష్ణ మాన్యం మొదటి సినిమా అయినా తన నటనతో ఆకట్టు కొంటూ తన స్కూల్ టీచర్ పాత్రలోను, గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా ఒదిగి పోయారు.

హీరో కటౌట్ సైజ్ లా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను బాగా కనిపించాడు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే గవర్నమెంట్ అధికారిణిగా తన నటనలో పరిణితిని చూపిస్తూ చక్కగా నటించారు.

జెట్టి కధ కు విలన్ గా మైమ్ గోపి రౌద్ర రూపం తెలుగు ప్రేక్షకులకు చూపించాడు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యి ఓక కోటి 40 లక్షల వ్యూ లు సంపాదించి ఇంకా సంగీత ప్రియాలను ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కథ

నటీనటులు

కొత్తదనం

మైనస్ పాయింట్స్:

కొత్త నటులు

పబ్లిసిటీ లేకపోవడం

సెకండ్ హాఫ్ స్లో అవ్వడం

చివరగా : హృద్యమైన మత్స్యకారుల జీవన చిత్రం జెట్టి

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here