ఓటీటీలో అదరగొడుతున్న  ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ 

0
204
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చిన  చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది.
లక్ష్ పర్ఫార్మెన్స్ , సాయి కార్తీక్ సంగీతం, కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చిత్రం లోని పాటలు, ఇంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్ మరియు ట్విస్ట్ లు ప్రేక్షకులని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష స్పందనతో కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో లక్ష్, వేదిక ద‌త్, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ఇషాన్ సూర్య‌
నిర్మాత‌:  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here