“గ్రే మాన్” తో పాటు విక్కీ కౌశల్ మీకోసం వచ్చేస్తున్నారు!!

0
232

ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్‌ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘గ్రే మాన్ టీమ్ తో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నారు అందులో వాళ్లకి మీ సహాయం కావాలి’ అంటూ ఆ వీడియో లో ఉన్న ఒక సీక్రెట్ కోడ్ ని చెప్పి ‘గ్రే మాన్’ ఇండియన్ ప్రీమియర్ టికెట్స్ గెలుచుకునే అవకాశం ఇచ్చారు. ముంబై లో జులై 20 న జరిగే ఈ ప్రీమియర్ లో మూవీ డైరెక్టర్స్ తో పాటు ధనుష్ ఇతర తారాగణం హాజరు కానున్నారు.

ఈ చిత్రం జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు.

మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు.

ది గ్రే మ్యాన్ గురించి
దర్శకులు: ఆంథోని రుసో, జో రుసో
రచయితలు: జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీలీ
నిర్మాతలు: జో రోత్, జెఫరీ కిర్స్ చెన్ బామ్, ఆంథోని రుసో, జొ రుసొ, మైక్ లారొక్కా, చిరిస్ కాస్టాల్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పాట్రిక్ నెవాల్, క్రిస్టొఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీలీ, జాక్ ఆస్ట్, అంగేలా రుసొ-ఒట్ స్టాట్, జియోఫ్ హాలే, జాక్ రూత్, పాలక్ పటేల్
ఆధార పుస్తకం సిరీస్: ది గ్రే మ్యాన్, రచయిత మార్క్ గ్రీనే
నటీనటులు: రయాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సీకా హెన్విక్, వాగ్నర్ మౌరా, ధనుష్, బిల్లీ బాబ్ థోర్న్ టన్, అల్ ఫ్రె వుడార్డ్, రెగె-జీన్ పేజ్, జులియా బుటర్స్, ఎమె ఇక్ ఉవాకర్, స్కాట్ హేజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here