‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా చూసి ఫ్యామిలీలో ప్ర‌తి ఒక్క‌రూ నాతో ల‌వ్‌లో ప‌డుతారు :  థియేట్రిక‌ల్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌

0
340
‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం.  మే 6న సినిమా భారీ లెవల్లో విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్‌ను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..
హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ ‘‘నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సినిమా చేయాలనుకున్నాం. ముందుగా షార్ట్ ఫిలింస్ చేయాలనుకున్నాం. ఆ సమయంలో డైరెక్టర్ విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇద్ద‌రం క‌లిసి రెండు, మూడు షార్ట్ ఫిలింస్ చేశాం కానీ వాటిని అప్ లోడ్ చేయ‌లేదు. ఎనిమిది, తొమ్మిదేళ్ల ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కులు మాకు అండ‌గా నిల‌వ‌డం వ‌ల్ల‌నే ఇక్క‌డ వ‌ర‌కు రాగ‌లిగాం. కోవిడ్ స‌మ‌యంలో అంద‌రం వేరే డిప్రెష‌న్‌లో ఉన్నాం. ఆ స‌మ‌యంలో నాకు ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ క‌థ నెరేట్ చేద్దామ‌ని విద్యా సాగ‌ర్‌, ర‌వి కిర‌ణ్ ప్ర‌య‌త్నించారు. నేను రెండు, మూడుసార్లు త‌ప్పించుకున్నాను. కానీ ఓ రోజు విన్నాను. తొలి ప‌ది నిమిషాల్లోనే సినిమా చేయాల‌ని డిసైడ్ అయిపోయాను. అదృష్ట‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గానే సినిమాను చూశాను. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. కానీ.. ఇప్పుడు చెబుతున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. బాపినీడు, సుధీర్‌, ర‌వి కిర‌ణ్‌, విద్యాసాగ‌ర్‌ల‌కు థాంక్స్‌. ప‌వ‌న్ బ్యూటీఫుల్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. జై క్రిష్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. దాని కంటే ప‌ది ఇర‌వై రెట్లు సినిమా బావుంటుంది. ఈ సినిమాతో ఇంట్లోని అంద‌రూ నాతో ల‌వ్‌లో ప‌డిపోతారు. మే 6న ఫ్యామిలీతో క‌లిసి సినిమా చూడండి మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు.
నిర్మాత బాపినీడు మాట్లాడుతూ ‘‘‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. మే 6న రిలీజ్ అవుతున్న సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. మే 6న సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
నిర్మాత సుధీర్ ఈదర మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ముందుగా విశ్వ‌క్ సేన్‌, ర‌వి కిర‌ణ్ కోలాల‌కు ముందుగా థాంక్స్ చెప్పాలి. ర‌వి కిర‌ణ్ అయితే క‌థ‌ను అందించ‌డంతో పాటు సినిమా బాగా రావ‌డంలో స‌పోర్ట్ చేశారు. అలాగే విశ్వ‌క్ మంచి స‌పోర్ట్ చేశాడు. మంచి టీమ్‌తో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది. మే 6న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ మూవీ మీ ముందుకు రానుంది’’ అన్నారు.
రాజావారు రాణిగారు డైరెక్ట‌ర్ ర‌వి కిర‌ణ్ కోలా మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో యాబై లక్షలతో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమా చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి పేరు వచ్చింది. అందరూ పిలిచి అవకాశాలు ఇచ్చారు. అదే సమయంలో కోవిడ్ ప్రభావం స్టార్ట్ అయ్యింది. అన్నింటి కంటే ముందు థియేటర్స్ మూతపడ్డాయి. అన్నీ ఓపెన్ అయినా కానీ థియేటర్స్ ఓపెన్ కాలేదు. దాంతో టీమ్ అంతా భయపడ్డాం. నాలా ఓ సినిమా తీసినోళ్లు, తీస్తున్నవాళ్లు, తీద్దామనుకుని వచ్చినోళ్లు అందరూ భయపడ్డారు. మళ్లీ సినిమా ఈజ్ బ్యాక్. థియేటర్స్ కిటకిటలాడుతున్నాయి. ఇంత మంచి టైమ్‌లో మా టీమ్ నుంచి ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ వంటి మంచి సినిమా వస్తుంది. అందరూ ఫ్యామిలీలతో కలిసి సినిమా చూడటానికి బయటకు వస్తున్నారు. ఇది యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అందరికీ నచ్చే సినిమా. ఐడియా విన్నప్పటి నుంచి సుధీర్‌గారు, బాపినీడుగారు మాతో ట్రావెల్ చేశారు. విశ్వక్ సేన్‌గారికి ఇది చాలా కొత్త‌గా ఉంటుంద‌ని ఆలోచించాం. ఆయ‌న కూడా ఇలాంటి క్యారెక్ట‌ర్ చేస్తాడ‌ని ఊహించి ఉండ‌రు. అంత కొత్త‌గా క‌నిపిస్తారిందులో. కంప్లీజ్ ప్యాకేజ్‌లా సినిమాను త‌యారు చేశాం. ట్రైల‌ర్ కంటే వంద రెట్లు సినిమా బావుంటుంది’’ అన్నారు.
డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ చింతా మాట్లాడుతూ ‘‘నిర్మాత‌లు బాపినీడు, సుధీర్‌గారికి థాంక్స్‌. వారు మ‌మ్మ‌ల్ని న‌మ్మ‌డం వ‌ల్లే ఇంత మంచి ఔట్‌పుట్ వ‌చ్చింది. ఇక మా షో ర‌న్న‌ర్ ర‌వి కిర‌ణ్ కోలా గారికి పెద్ద థాంక్స్ చెప్పాలి. న‌న్ను ముందుండి గైడ్ చేసి న‌డిపించారు. విశ్వ‌క్ సేన్ న‌ట‌న‌ను చూసి ‘హే క‌మ‌ల్ హాస‌న్ మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్‌రా భాయ్’ అంటారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా చూసి పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుకుంటారు. క‌ళ్ల‌లో నీళ్లు కూడా తిరుగుతాయి. ఫ్యామిలీతో క‌లిసి సినిమా చూడండి’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ జై క్రిష్ మాట్లాడుతూ ‘‘‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బాపినీడు, సుధీర్‌గారికి థాంక్స్‌. ‘రాజావారు రాణిగారు’ సినిమా తర్వాత అదే టీమ్‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. విశ్వ‌క్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం మంచి మూమెంట్‌ ఫైన‌ల్ మిక్స్ చూశాం. సినిమా క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది’’ అన్నారు.
రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఎంతో ద‌గ్గ‌రైన రోల్‌. మాధ‌వి అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్.. నిర్మాత‌లు బాపినీడు, సుధీర్‌గారు, విశ్వ‌క్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. కోవిడ్ స‌మ‌యంలోనూ టీమ్ స్పిరిట్‌తో వ‌ర్క్ చేశాం. చక్క‌టి సినిమా చేశాం. మే 6న వ‌స్తున్న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ మీ ముఖాల్లో న‌వ్వును తీసుకొస్తుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:
విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింతా
స‌మ‌ర్ప‌ణ‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా
బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌
నిర్మాత‌లు:  బాపినీడు, సుధీర్ ఈద‌ర‌
సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వి కె.ప‌వ‌న్‌
సంగీతం:  జై క్రిష్‌
ర‌చ‌న‌:  ర‌వికిర‌ణ్ కోలా
ఎడిట‌ర్‌:  విప్ల‌వ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి
పి.ఆర్‌.ఓ :  వంశీ కాకా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here