సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మాస్ సాంగ్ భారీ సెట్ లో షూటింగ్

0
280
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. షూటింగ్ లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో  చిత్రీకరిస్తున్నారు. దీంతో
సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ చిత్రానికి ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న పాట మాస్ సాంగ్ గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి  కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా ఇందులో కనిపించారు.  ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయిక.

ఆర్ మధి సినిమాటోగ్రఫర్ గా,  మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్  డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా
గ్రాండ్‌గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here