యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. తను ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు.
టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మొదటి సింగిల్ లిరికల్ వీడియో కూడా చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ రోజు రొమాంటిక్ మెలోడీగా రూపొందిన `బుల్లెట్ లా` లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. శేఖర్ చంద్ర తన వాద్యసంగీతంలో ఆకట్టుకునేలా చేశాడు. కిరణ్, చాందిని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చిన ఆయన సంగీతంలో మంచి అభిరుచి ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సింగిల్ లాగానే ఇది కూడా హిట్‌గా నిలుస్తుంది.
యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె ప్రవీణ నిర్మించిన “సమ్మతమే” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: UG ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
కెమెరా- సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
పి.ఆర్.ఓ.- వంశీ-శేఖర్