విష్ణు మూర్తి అవతార భక్తిరస “శ్రీ రంగనాయక” చిత్రం పోస్టర్ & టీజర్ లాంచ్
గోవింద రాజ్ విష్ణు ఫిలిం బ్యానర్ పై వినయ్ రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగ బాషా ,నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి నటీనటులుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించిన చిత్రం “శ్రీ రంగనాయక”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు, దర్శక,నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్,ఏలూరు సురేంద్ర రెడ్డిలు చిత్ర పోస్టర్ లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపు కుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఈ చిత్ర పోస్టర్ మరియు టీజర్ వేడుక ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ,నటుడు కెప్టెన్ చౌదరి, నటుడు, నిర్మాత కోప్పిలి శ్రీనివాస్, దర్శకుడు దొరై రాజు, జూనియర్ పవన్ కళ్యాణ్, కరాటే యస్ శ్రీనివాస్, యస్.సౌమ్య, తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్, మరియు టీజర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..నాకు భక్తి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది విష్ణుమూర్తి పైన వస్తున్న “శ్రీ రంగ నాయక” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం దర్శక,నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో విష్ణుమూర్తి మీద చేసిన భక్తిరస చిత్రాలు అన్ని హిట్ అయ్యాయి.ఆ సినిమాల మాదిరే ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. ఇప్పుడు కొత్త నటుడు రూపంలో ఇండస్ట్రీ కి దుందిగల్ వినయ్ రాజ్ విష్ణుమూర్తి అవతారంలో పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాకు ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
నటుడు, చిత్ర నిర్మాత వినయ్ రాజ్ దుందిగల్, రామావత్ మంగమ్మ మాట్లాడుతూ ..భగవంతుని అనుగ్రహము నాపై ఉండడం వలన నా మొదటి సినిమాతో నేను విష్ణు మూర్తి పాత్రతో ఇండస్ట్రీ కు ఎంటర్ అవుతున్నందుకు నా పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మా అక్క, బావలు నవ్వాడ విజయేంద్ర, శోభ విజయేంద్ర సహకారం తో నేను ఈ సినిమా నిర్మించగలిగాను. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఘన విజయం వైపు తీసుకెళ్లాలని కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు నంది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ఈ చిత్రంలో విష్ణు మూర్తి పాత్ర కొరకు సుమన్ గారిని అడగడం జరిగింది.తను బిజీగా ఉండడంతో కుదరలేదు.ఈ పాత్ర కోసం ఎంతో మందిని కలసినా సెట్ అవ్వలేదు.చివరకు వినయ్ రాజ్ గారు ఫెస్ సీనియర్ ఎన్టీఆర్ ఆహార్యం లా అగుపించడంతో తనను సెలెక్ట్ చేయడంతో విష్ణుమూర్తి పాత్రలో అద్భుతంగా నటించడం జరిగింది.నటిస్తూనే తను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగింది.ఇప్పటి వరకు విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు రంగ బాషా ను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయడం జరిగింది.తను ముస్లిం అయినా విష్ణు మూర్తి భక్తుని పాత్రలో అద్భుతమైన నటనను కనపరచారు.దర్శక,నిర్మాతలు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇందులోని పాటలు అద్భుతంగా వచ్చాయి .త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
చిత్ర హీరో రంగ బాషా మాట్లాడుతూ..”రంగ నాయక” టైటిల్ లోనే పవర్ ఉంది. విలన్ పాత్ర కొరకు వెళ్లిన నాకు ఇంతకు ముందు నేను నటించిన సినిమాలు చూసి ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించారు. ఇలాంటి మంచి భక్తి సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు జీవితాంతం ఋణపడి ఉంటాను అన్నారు.
విలన్ గా నటించిన నటుడు లెంకల అశోక్ రెడ్డి మాట్లాడుతూ…ఇంతకు ముందు నేను మూడు సినిమాలు నిర్మించడం జరిగింది.ఈ సినిమాలో నేను గ్రామ సర్పంచ్ గా మంచి పాత్రలో నటించడం జరిగింది.ఈ సినిమా కోసం దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటి పండ్రాల లక్ష్మీ మాట్లాడుతూ. ఇలాంటి మంచి సినిమాలో విష్ణుమూర్తికి భార్యగా లక్ష్మీ దేవి రూపంలో నటించే అవకాశం కల్పించిన. దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ.. తనికెళ్ళ భరణి, దామోదర్ ప్రసాద్,ఏలూరు సురేంద్ర రెడ్డి, ప్రసన్నకుమార్ లు మా చిత్ర పోస్టర్ లను విడుదల చేశారు. అలాగే దర్శకుడు సముద్రగారు ఎంతో బిజీగా వున్న కూడా మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.వారందరికీ మా ధన్యవాదాలు. ఇందులోని పాటలు బాగా వచ్చాయి. వచ్చే నెలలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నటుడు కెప్టెన్ చౌదరి మాట్లాడుతూ..ఈ మధ్య భక్తి రసమైన చిత్రాలు రావడం కరువై పోయిన తరుణంలో ఎంతో ధైర్యం చేసి “రంగ నాయక” సినిమా చేయడం గొప్ప విషయం.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
దర్శకుడు దొరై రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం దెయ్యం సినిమాలు చూసినంతగా దేవుడు సినిమాలు చూడడం లేదు.కాబట్టి దేవుడిపై తీసున్న ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించి అభినందించాలి అన్నారు.
నటుడు ,నిర్మాత కొప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రొమాన్స్, ఫైట్స్ ఉన్నటువంటి సినిమాలు చేస్తున్న తరుణంలో “రంగ నాయక” మైన ఆధ్యాత్మిక మైన చిత్రం చేయడం గొప్ప విషయం.నటుడు రంగ భాషా ముస్లిం అయినా విష్ణు మూర్తికి భక్తుడిగా అద్భుతమైన నటనకు కనపరచారు. ఈ సినిమా అందరికీ గొప్ప విజయం సాధించాలని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రసంగించారు.
నటీనటులు :
వినయ్ రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగ బాషా , నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : గోవింద రాజ్ విష్ణు ఫిలిమ్స్
సినిమా : శ్రీ రంగనాయక
ప్రొడ్యూసర్ ::రామావత్ మంగమ్మ
స్క్రీన్ ప్లే డైరెక్షన్ : వెంకట్ రెడ్డి నంది
స్టోరీ రైటర్ :;నర్లా రామకృష్ణ రెడ్డి
కెమెరామెన్ : డి.యాదగిరి
మ్యూజిక్ డైరెక్టర్ : డ్రమ్స్ రాము
డైలాగ్స్ : ముత్యాల గణేష్
ఎడిటింగ్ : ప్రవీణ్ కుమార్, ఆర్ విజయ్ కుమార్