విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా `మిస్టర్ కింగ్`చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే `మిస్టర్ కింగ్`షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సందర్భంగా `మిస్టర్ కింగ్`పోస్టర్‌ను ఆదివారంనాడు విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా నానక్ రూమ్ గూడాలోని సూపర్ స్టార్ కృష్ణ స్వగృహంలో కృష్ణ గారు ఆవిష్కరించారు.
అనంతరం సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ, విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా `మిస్టర్ కింగ్`పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా వుంది. ఈ సినిమా ద్వారా హీరోగా శరణ్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సినిమా సూపర్ హిట్ కావాలి. దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ, నిర్మాతలు నాగేశ్వరరావు, రవికిరణ్‌లు నిర్మిస్తున్నారు. శశిధర్ దర్శకుడు. హీరో శరణ్ నా అల్లుడు. నా కజిన్ రాజ్ కుమార్ కొడుకు. మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో. మంచి టీమ్‌తో ముందుకు వస్తున్నారు. మా అమ్మగారి ప్రతి పుట్టినరోజునాడు అభిమానులు ఇక్కడకు వచ్చి ఆశీర్వచనాలు తీసుకునేవారు. ఈ సందర్భంగా `మిస్టర్ కింగ్`పోస్టర్‌ను నేడు ఆవిష్కరించడం జరిగింది. ఎట్రాక్టివ్ టైటిల్‌తో అలరించేట్లుగా వుంది. ఈ సినిమాలో సహనటులు సీనియర్స్ మురళీశర్మ, సునీల్ వంటివారు నటిస్తున్నారు. చక్కటి నిర్మాణ విలువలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. శరణ్ మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.
నిర్మాత బి.ఎన్.రావు మాట్లాడుతూ, మంచి కేరెక్టర్ వుంటే రాజుతో సమానం. అందుకే కథా పరంగా `మిస్టర్ కింగ్`అనే పేరు పెట్టాం. మా అమ్మగారు కూడా విజయనిర్మలగారి అభిమాని. ఈరోజు మా సినిమా పోస్టర్ ఆవిష్కరించిన కృష్ణగారికి, నరేశ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
చిత్ర దర్శకుడు శశిధర్ చావలి తెలుపుతూ, చక్కటి కుటుంబకథా చిత్రంగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.
చిత్ర హీరో శరణ్ మాట్లాడుతూ, తాతగారు కృష్ణ, నరేశ్ అంకుల్, నాని ఆశీర్వాదాలతో నేను హీరోగా ముందుకు వస్తున్నాను. నరేశ్ అంకుల్ నా రోల్ మోడల్. తాతగారి సినిమాలు, నరేశ్ అంకుల్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలా ఇంట్రెస్ట్ తో హీరో అవ్వాలనుకున్నాను. ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నా పాత్ర పేరు శివ. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా. మణిశర్మగారు చక్కటి బాణీలు సమకూర్చారని తెలిపారు.
నటీనటులుః
శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు
సాంకేతిక సిబ్బందిః
నిర్మాణం: హన్విక క్రియేషన్స్, ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్, నిర్మాత: బి.ఎన్.రావు, కథ & దర్శకత్వం: శశిధర్ చావలి, సంగీత దర్శకుడు: మణిశర్మ, సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్, సాహిత్యం: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కడలి, సహ నిర్మాత: రవికిరణ్ చావలి, కొరియోగ్రాఫర్: భూపతి రాజా,
పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్, పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్,
కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి & రాజశ్రీ రామినేని