సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారక క్రియేషన్స్ ‘అఖండ’
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అఖండతో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అఖండ విడుదలై 25 రోజులైన ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. నాలుగో వారంలో కూడా అఖండ భారీ కలెక్షన్లు రాబట్టింది.
అఖండ భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ పాల్గొంది.
ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. చిత్రయూనిట్ కు సక్సెస్ షీల్డ్‌ను అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
2021లో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అఖండ విడుదలైన అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ విజయంతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు చిగురించాయి.
మాస్ సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేయడంలో బోయపాటి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించారు. ఇక అఖండలో బాలకృష్ణ నటవిశ్వరూపానికి అవార్డులు రావాల్సిందే. అఖండ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ సాధించారు.
అఖండ చిత్రానికి తమన్ సంగీతం అతిపెద్ద బలంగా నిలిచింది. సీ రామ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి అఖండను ఘన విజయాన్ని చేశాయి. అఖండ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించారు.