‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల

0
375

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 26, డిసెంబర్ 2021 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ అను పాట సీడీ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో జరిగినది. చెన్నైకు చెందిన వి.జి.పి గ్రూప్ చైర్మన్ డా. వి.జి. సంతోషం చేతుల మీదుగా విడుదలైన ఈ సీడీని.. నటుడు, నిర్మాత, సంతోషం పత్రిక అధినేత కొండేటి సురేష్ మరియు సినీ నిర్మాత సాయి వెంకట్ స్వీకరించారు. ‘‘శ్రీమద్భగవద్గీత’’ను ప్రస్తుత కాలములోని జనులందరికీ అర్థమయ్యేలా శ్రీదేవాశీర్ లారిగారు వివరించిన ‘అక్షయమైన యోగము యొక్క ఉపదేశము’ను పాటల రూపములో రచించి, ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితమును గ్రహింపజేసేలా ఈ పాటల సీడీని శ్రీ సౌందర్యలహరి క్రియేషన్స్, మనుజ్యోతి ఇంటర్నేషనల్ వారు తయారు చేసి ఉన్నారు.

ఈ ఆధ్యాత్మిక సభకు వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ పి. మోహన్ గాంధీగారు అధ్యక్షత వహించగా.. మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు డి.పి. ఉపాజ్ ఎన్.లారిగారు అతిధులకు ఆహ్వానం పలికారు. ఈ సీడీలోని పాటల గురించిన వివరణను ప్రొడ్యూసర్ లియో పి.సి.లారిగారు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమములో ఉమాపతి నారాయణ శర్మ, డాక్టర్ పి. బంగారయ్య, గంజికుంట్ల రాఘవేంద్ర, ఆవుల ముత్తయ్యలతో పాటు పలువురు సినీ తారలు, టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here