ట్రైలర్ లో బండ్ల గణేష్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో ‘డేగల బాబ్జీ’ కి పాజిటివ్ బజ్.. ఓటిటి ల నుండి భారీ ఆఫర్స్… త్వరలో థియేటర్ల లో విడుదల
ప్రముఖ నటుడు, స్టార్ హీరోల తో భారీ చిత్రాలు నిర్మించిన పాపులర్ నిర్మాత బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ తో హీరోగా పరిచయం అవుతున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. తెలుగు లో తొలిసారిగా సింగిల్ యాక్టర్ తో సింగిల్ లొకేషన్ లో నిర్మించిన పూర్తి విభిన్న చిత్రం ఇది.
ఇటీవలే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. వినూత్న తరహాలో ఉన్న ట్రైలర్ సినిమా మీద ఆసక్తి నీ మరింత పెంచేలా ఉంది. మర్డర్ కేసులో అనుమానితుడిగా డేగల బాబ్జీ పాత్రలో కనిపించే బండ్ల గణేష్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఆద్యంతం ఎమోషనల్ డైలాగ్స్ తో సాగే ట్రైలర్ లో బండ్ల గణేష్ విభిన్న హావభావాలతో ఎమోషన్ ను పండించారు. అగ్ర ఓటిటి సంస్థలు డేగల బాబ్జీ స్ట్రీమింగ్ రైట్స్ కి రూ 4 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు త్వరలోనే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




