శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) బేనర్ ప్రొడక్షన్ నెం1 సినిమా టైటిల్ లోగోను ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ బ్యూటిఫుల్ పాయల్ రాజ్ పుత్ లాంచ్ చేశారు. కొత్త వాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సౌండ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మల్టీ బ్రాండ్ అనేది క్యాప్షన్. పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా టైటిల్ లోగో రివీల్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ ” మన జీవితంలో ‘సౌండ్’ అనేది చాలా కామన్ వర్డ్. అందుకే సినిమాకు ఈ క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మంచి కథతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్ళను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఇటివలే మేము చేసిన ఆడిషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మందిని సెలెక్ట్ చేశాం. త్వరలోనే హీరో -హీరోయిన్ ఎవరనేది రివీల్ చేస్తాం. అలాగే సినిమాకు చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.”అని తెలిపారు.
నిర్మాత కే. రవీంద్ర మాట్లాడుతూ ” మా దర్శకుడు చాలా మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఏ సినిమాకయినా టైటిల్ అనేది చాలా ముఖ్యం. జనాల్లోకి సినిమా కంటే ముందు టైటిల్ వెళ్తుంది. అందుకే అందరికీ రీచ్ అయ్యేలా ఈ టైటిల్ పెట్టాము. మా ‘సౌండ్’ టైటిల్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. నవంబర్ మూడో వారం నుండి షూటింగ్ మొదలు పెట్టనున్నాము. అందరి ఆశీస్సులు మా బేనర్ కి సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాం.” అన్నారు.