‘మిషన్ 2020’ రివ్యూ

0
759

చిత్రం: ‘మిషన్ 2020’
సెన్సార్‌: యు/ఎ
వ్య‌వ‌థి: 2 గం 20 ని
నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు
దర్శకుడు: కరణం బాబ్జి
నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు
సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్

నవీన్ చంద్ర హీరోగా కరణం బాబ్జి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మిషన్ 2020”. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏమాత్రం సందేశం ఇచ్చిందో చూద్దాం పదండి.

కథ : జయంత్ (నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్. నేరం రుజువు అయితే ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడడు. అయితే మరోపక్క ప్రకాష్ అతని ముగ్గురు ఫ్రెండ్స్ గుడ్ స్టూడెంట్స్. కాలేజీలో టాపర్స్ కూడా. అయితే, నలుగురూ అశ్లీల వీడియోల మత్తులో పడి.. చదువు పై నిర్లక్ష్యం చేస్తారు. ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారం జరుపుతారు. దాంతో మంచి వాళ్ళుగా, మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ మరియు అతని ఫ్రెండ్స్ జీవితాలు ఎలా తారుమారయ్యాయి ? అసలు వీళ్ళను పోలీస్ ఆఫీసర్ జయంత్ (నవీన్ చంద్ర) ఎలా పట్టుకున్నాడు ? ఈ క్రమంలో జయంత్ ఏమి చేశాడు ? అసలు ప్రకాష్, అతని ఫ్రెండ్స్ అత్యాచారం చేయడానికి అసలు కారణం ఏమిటి ? చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

కథ… కథనం విశ్లేషణ:

మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత… అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా.. మెసేజ్ పరంగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథ… కథనాలు, మెప్పించే సన్నివేశాలు, బలమైన పాత్రలు… సినిమా కి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు చాలా వున్నాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మంచి సందేశంతో పాటు ఫాదర్ సెంటిమెంట్ మరియు శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. ఇక చైతన్యంతో ఎదగాల్సిన యువత అశ్లీల వీడియోల మత్తులో పడి బతుకును ఎలా దుర్భరం చేసుకుంటుందనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే.
ముఖ్యంగా అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు. అలాగే సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులను, జనం ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర‌లో నటించిన నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

మంచి మెసేజ్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు కరణం బాబ్జి, ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సన్నివేశాలను రాసుకొని సక్సెస్ అయ్యారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఐటెం సాంగ్ యూత్ ని అలరిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సినిమాకి తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు. మూవీ క్వాలిటీగా ఉంది.

బాటమ్ లైన్: గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3.25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here