ఏకమ్ సినిమా – రివ్యూ

0
1449

చిత్రం – ఏకమ్
నటీనటులు – అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, అదితి మైకేల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి, శ్వేతా వర్మ తదితరులు
బ్యానర్స్ – ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం – జోన్ ఫ్రాంక్లిన్
సమర్పణ – బోయపాటి రఘు
కథ, దర్శకత్వం – వరుణ్ వంశీ

బోయపాటి రఘు సమర్పణ లో ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తం గా నిర్మించిన చిత్రం ఏకమ్, ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.సినిమా సస్టార్ట్ అవ్వగానే దర్శకుడు అయిదు క్యారెక్టర్ల సమూహారమే ఏకం మూవీ స్టోరీ అని ఒక క్లారిటీ ఇచ్చేసాడు, టైటిల్స్ దగ్గర నుంచి తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేసాడు దర్శకుడు, ఏకమ్ మూవీ ఎలా ఉందొ మన రివ్యూ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టోరీ :ఆనంద్ (అభిరామ్ )తనికెళ్ళ భరణి (అప్పయ్య పంతులు )అదితి మైకేల్ (దివ్య )కల్పిక గణేష్ (నిత్య )దయానంద్ రెడ్డి (డేవిడ్ )బిగ్ బాస్ 5 ఫ్రేమ్ శ్వేతా వర్మ (నిర్వాణ)ఈ అయిదు క్యారెక్టర్లు చుట్టూ నే కధ తిరుగుతుంది. ఆనంద్ తన కుటుంబాన్ని చిన్నవయసులోనే పోగొట్టుకొని ప్రేమించిన అమ్మాయి దూరమయ్యి జాబ్ వచ్చిన చెయ్యకుండా ఈ ప్రపంచం లో ఎదో అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు,అప్పయ్య దేవుడు దగ్గర పూజలు చేస్తూవున్న తనని అదే దేవుడు తనకి పనిలేకుండా చేసాడు అని దేవుడి మీద కోపం తో అదే దేవుడిని (శివుడు )స్మశానం లోకి తీసుకోని పోయి అక్కడే ఉంటాడు,దివ్య తండ్రి ని కోల్పోయి తన డ్రీం ఎప్పటికి అయినా కాఫీ షాప్ పెట్టి పైకి రావాలి అని,డేవిడ్ ఒక విలన్ కానీ అదే దివ్య దగ్గర కాఫీ షాప్ లో నాకు తినటానికి కూడా తిండి లేదు జాబ్ కావాలి అని వచ్చి జాబ్ చేస్తాడు,నిత్య ఆనంద్ ని ఎలాగైనా మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలి అనికుంటుంది,నిర్వాణ తన ప్రెమించిన అబ్బాయి అనుకోకుండా జరిగిన సంఘటన వాళ్ళ నిర్వాణ ని రిజెక్ట్ చేస్తాడు, అప్పుడు నిర్వాణ ఆనంద్ ఎందుకు కలుసుకున్నారు,ఆనంద్ స్మశానం లో వున్నా అప్పయ్య ని ఎందుకు కలుసుకున్నాడు,డేవిడ్ దివ్య కాఫీ షాప్ లో పనిచేయటానికి కారణం ఏమిటీ,నిత్య ఆనంద్ చివరకి కలుసుకున్నారా లేదా తెలియాలి అంటె సినిమా చూడ వలసిందే.

నటినటుల పెర్ఫార్మన్స్ :
ఫస్ట్ హాఫ్ అంత క్యారెక్టర్లు పరిచయం చేసి ఎక్కడ బోరింగ్ గా లేకుండా చాలా ఫాస్ట్ గా కధ కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విదంగా దర్శకుడు వరుణ్ వంశీ చాలా జాగర్తగా నడిపించాడు,అభిరామ్ వర్మ,బిగ్ బాస్ 5శ్వేతా వర్మ సెకండ్ హాఫ్ అంత వాళ్ళ భుజాలు మీద నడిపించారు,తనికెళ్ళ భరణి తనకి తానే సాటి విష్ణువు భక్తుడి పాత్రలో ఒదిగిపోయారు,కల్పిక పాత్ర నిడివి చాలా తక్కువ వున్నా కథ కి కనెక్షన్ వుండే రోల్ ప్లే చేసింది,ఇకపోతే దయానంద్ రెడ్డి మరియు అదితి మైకేల్ కాఫీ షాప్ ఎపిసోడ్ కి ప్రాణం పోసారు,ఇకపోతే ఈ సినిమా కి ప్రాణం సెకండ్ హాఫ్ లో వచ్ఛే శివుడి మీద వచ్ఛే సాంగ్ అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జోస్ ఫ్రాంక్లిన్ ప్రాణం పెట్టాడు అని చెప్పాలి,ఇకపోతే డైరెక్టర్ వరుణ్ వంశీ తను చెప్పే ప్రతి డైలాగ్ కి చాలా డెప్త్ ఉంటుంది,సినిమా లో ప్రతి మాట ప్రతి పదానికి ఒక అర్ధం ఉంటుంది,సినిమా శుభం కార్ద్ లో జీవితాన్ని అన్వేషించు కొని పోయే వాళ్ళకి మా ఈ చిత్రం అంకితం అని చెప్పాడు అది తన దర్శికత్వ ప్రతిభకు నిదర్శనం, చివరిగా ఈ సినిమా ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతల కి గట్స్ ఉండాలి ,ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ
క్యారెక్టర్స్
మ్యూజిక్
డైరెక్షన్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో నిడివి తక్కువ ఉండటం

తారాగణం :అభిరామ్ వర్మ (అభిరామ్ )తనికెళ్ళ భరణి (అప్పయ్య పంతులు )అదితి మైకేల్ (దివ్య ) కల్పిక గణేష్ (నిత్య )దయానంద్ రెడ్డి (డేవిడ్ )శ్వేతా వర్మ (నిర్వాణ)
టెక్నిషియన్స్ :
సమర్పణ :బోయపాటి రఘు
ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్ :జోస్ ఫ్రాంక్లిన్
స్టోరీ అండ్ డైరెక్షన్ :వరుణ్ వంశీ
రేటింగ్ 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here