ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. ప్రముఖ నిర్మాత, జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు కన్నుమూత. వారి మహాభినిష్క్రమణంతో ఒక్కసారిగా మూగబోయిన చిత్ర పరిశ్రమ. వారి జీవితం మరియు కెరీర్ లోని ముఖ్య ఘట్టాలు, విశేషాలు.
1. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు ఈనెల 31న జన్మదినం జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు ఆయన సినిమా కెరీర్ విశేషాలు.
2. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రత్యేక పోస్టర్.
3. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా ఆలపించిన శ్రీరామదండకం యూట్యూబ్ లో విడుదల.
4. పాన్ ఇండియా మూవీ శాకుంతలం తో సెన్సేషన్ క్రియెస్ట్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ పుట్టినరోజు సందర్భంగా వారి మూవీ కెరీర్ విశేషాలు.
5. డేరింగ్ అండ్ డాషింగ్ గా తెలుగు సినిమా రేంజ్ ని సెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ జీవితం, సినిమా ల విశేషాలు.
6. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కృష్ణ గారి జన్మదినం రోజున సర్కారు వారి పాట నుండి ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వబోవడం లేదు అంటూ ఆ మూవీ యూనిట్ అధికారిక ప్రకటన విడుదల.
7. రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా దర్శకేంద్రులు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పెళ్లిసందడి నుండి ఇటీవల విడుదలైన బుజ్జులు బుజ్లులు సాంగ్ కి 2 మిలియన్ వ్యూస్.
8. బింబిసార ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు.
9. ప్రముఖ నిర్మాత, పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజుగారి హఠాన్మరణం మమ్మల్ని ఎంతో కలిచి వేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరినీ ఎంతో సంతోషంగా పలకరిస్తూ కలుపుకుపోయే మంచి మనస్తత్వం గల రాజు నేడు మన మధ్యన లేరు అనే విషయం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది : గుణ టీమ్ వర్క్స్ వారి అశ్రు నివాళి
11. తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో దగ్గరి నుండి ప్రతి ఒక్క టెక్నీషియన్, సినిమా ప్రముఖులు, పాత్రికేయులు అందరూ కూడా బీఏ రాజు గారికి అశ్రునివాళులు అర్పించారు.
12. సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన మూవీ కెరీర్ గురించి పలు విషయాలు.
13. బీఏ రాజు ఇకలేరు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్న హీరోల అభిమానులు. జర్నలిస్ట్ గా, పీఆర్వో గా ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన రాజు గారిని అందరు హీరోల అభిమానులతో మంచి అనుబంధం ఉంది. పలువురు హీరోల అభిమానుల నివాళి.
14. సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ఏక్ మినీ కథ హిలేరియస్ హిట్ గా దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
15. బీఏ రాజు గారికి హృదయపూర్వక అశ్రునివాళి అర్పించిన ఆయన తనయులు బి అరుణ్ కుమార్, బి శివ కుమార్ మరియు సూపర్ హిట్ పత్రిక, ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ స్టాఫ్ ప్రత్యేక పోస్టర్.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!