ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత

0
295

ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జి గురువారం రాత్రి కరోనా తో కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు మాది రెడ్డి కృష్ణమోహన్ రావు. 1935లో గుంటూరులో పుట్టారు. వాళ్ల నాన్న కృష్ణారావు విజయవాడలో శ్రీకాంత్ పిక్చర్స్ పంపిణీ సంస్థ లో మేనేజర్ గా పనిచేసేవారు. తర్వాత వీళ్ళ కుటుంబం చెన్నై కి షిఫ్ట్ అయింది. తమ్ముడు జగన్ మోహన్ రావు తో కలసి మోహన్ జీ జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ప్రారంభించారు. ఎన్టీఆర్ నటించిన కాడే ద్దులు ఎ కరం నేల.. వీరి తొలి చిత్రం. అప్పటి నుండి 900 చిత్రాలకు ఈ సోదరులు పని చేశారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. ఆయన తొలి సినిమా తాత మనవడు నుండి ఒరేయ్ రిక్షా వరకూ వంద సినిమాలకు పని చేశారు. ఎన్టీఆర్, ఏ యాన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు, మురళీ మోహన్ చిత్రాలకే కాకుండా కన్నడం లో రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, తమిళంలో జెమినీ గణేషన్, రజనీకాంత్ చిత్రాలకు కూడా పని చేశారు. ఈ సోదరులలో చిన్నవాడైన జగన్ మోహన్ కొంత కాలం క్రితం కన్ను మూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here