వీరు సుప్రసిద్ధ టాలీవుడ్ నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు. ఆయన స్థాపించిన ‘స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా సంగీత విభావరులు నిర్వహించారు. ఆనంద్ గారు 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు.
ఆనంద్ గారు శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామంలో 16-02-1944 న జన్మించారు. వారి తండ్రి గారు రంగస్థలం మీద అనేక నాటక ప్రదర్శనలు చేసిన నాటక ప్రయోక్త. ఆనంద్ గారు తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడమే గాక వారు ప్రదర్శించిన పలు పౌరాణిక నాటకాలలో పాలు పంచుకున్నారు. వారి తండ్రిగారు రాముడి పాత్ర పోషించినప్పుడు, ఆనంద్ మరియు అతని సోదరుడు లవ-కుశ పాత్రలు పోషించారు.ఆనంద్ గారు తన గాన వృత్తిని ప్రారంభించినప్పుడు, తమ ఇరుగు పొరుగు గ్రామాలలో అనేక పండుగలు మరియు కార్యక్రమాలలో సంగీత విభావరులలో పాటలు పాడేవారు. ఆనంద్ గారు అనేక పోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు. అటువంటి ఒక పోటీలో, న్యాయమూర్తులుగా వ్యవహరించిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ.కె.వి.మహదేవన్ మరియు గాయకులు శ్రీ S.P. బాలసుబ్రహ్మణ్యం గార్లు అతని అసాధారణ ప్రదర్శనను గమనించి అతనిని విజేతగా ప్రకటించారు. ప్రదర్శన ముగిసిన తరువాత శ్రీ.కె.వి.మహదేవన్ గురువు అతనికి సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.
ఉత్తమ ప్రదర్శనలు:
•1972: పాండంటి కాపురం
•1976: అమెరికా అమ్మాయి
•1977: అమె కథ
•1977: కల్పన
•1977: దాన వీర శూర కర్ణ
•1977: చక్రధారి
•1977: బంగారక్క
•1978: మన ఊరి పాండవులు
•1978: ప్రాణం ఖరీదు
•1979: తాయరమ్మ బంగారయ్య
•1987: గాంధీనగర్ రెండవ వీధి
(సంగీత దర్శకుడు)
•1987: స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి (సంగీత దర్శకుడు)
•1990: రంగవల్లి (సంగీత దర్శకుడు)
కెరీర్:
తన మొదటి ప్రదర్శన తరువాత, అతను స్వర్గీయ లీలారాణి ఇంట్లో మద్రాసులో బస చేశారు. కొంతకాలం తరువాత అతను మేడిశెట్టి అప్పారావు మరియు శరత్ బాబు లతో కలిసి ఉన్నారు. నటుడు చంద్రమోహన్ గారి ఫంక్షన్లో అతని పాట విన్న, శ్రీ నవతా కృష్ణంరాజు గారు ఆనంద్ గారిని వెంకటేష్ గారికి పరిచయం చేశారు. అతని పాట విన్న తరువాత, వెంకటేష్ గారు పాడే అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు నుండి సాహిత్యం పొందడానికి వారు ఆయనను పంపారు. వారం తరువాత దేవులపల్లి గారు తన గొంతును ఇష్టపడ్డారు మరియు కె.వి.మహదేవన్ కు సిఫార్సు లేఖ రాశారు. చివరకు “అమెరికా అమ్మాయి” చిత్రంలో “ఒక వేణువు వినిపించెను” పాట పాడే అవకాశం వచ్చింది. ఆ సుమధర గీతంతో వారు తెలుగు చిత్రసీమకు తమ గళాన్ని పరిచయం చేసారు.
నవతరం స్వర మాధురి సంస్థ ద్వారా వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకులు ఆనంద్ గారు 2500 పైచిలుకు పాటలు పాడిన ఆయన 150 ఆల్బమ్స్ రిలీజ్ చేసారు . తెలుగు సినీ పరిశ్రమలో గాయకుని గానే కాక డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకునిగా రాణించారు .
స్వరమాధురి ఫౌండేషన్ వ్యవస్థాపకులైన ఈయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్స్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు . ఖ్యాతి తెచ్చిన పాటలు
•ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
•దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
•విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
•దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)



