కరోనాతో సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కన్నుమూత

0
285

సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57.

రియల్ స్టార్ శ్రీహరి నటించిన “శివాజీ”, “ఒరేయ్ తమ్ముడు“ చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు. ”సిరి”, “అపరంజి” “హాలాహలం”. సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. మెగాస్టార్ హీరోగా నాగబాబు గారు అంజనా ప్రోడ్సక్షన్స్ పతాకం పై నిర్మించిన ”బావగారు బాగున్నారా” చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు.

తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖ లో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్ కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here