ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

0
10
‘Tidutunna Kodutunna’ Love Song from ‘Mugguru Kothulu’ Released by Anup Rubens
‘Tidutunna Kodutunna’ Love Song from ‘Mugguru Kothulu’ Released by Anup Rubens

ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషించగా. వర్షిక పాశం హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్‌ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అనే పాటను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎస్. సుహాస్ బాణీ, జగదీష్ సాహిత్యంతో పాటుగా చైతన్య, లాస్య గాత్రం ఈ పాటను వినసొంపుగా మార్చాయి. ఇక ఈ లిరికల్ వీడియోని గమనిస్తే హీరో, హీరోయిన్.. లవ్ ట్రాక్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని అలరిచేందుకు టీం రెడీగా ఉంది.

నటీనటులు : తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

సాంకేతిక బృందం

సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత :శోభారాణి గరిమెల్ల
దర్శకుడు :కార్తీక్ గరిమెల్ల
కెమెరా :రాజ్ నోముల
సంగీతం :ఎస్. సుహాస్
ఎడిటింగ్ :జమీర్ షేక్
పీఆర్వో : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here