ఆశిష్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న `రౌడీ బాయ్స్‌` మూవీ మోష‌న్ ‌పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

0
276

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుంచి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందించారు స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌రాజు, శిరీష్‌. వీరి ఫ్యామిలీ నుంచి నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు‌. ఆశిష్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

కాలేజీ కుర్రాళ్లు, కాలేజీ జీవితం ఎలా ఉంటుందనే విషయాల బ్యాక్‌డ్రాప్‌తో ‘రౌడీ బాయ్స్‌’ తెరకెక్కినట్లు మోషన్‌ పోస్టర్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ‘రౌడీ బాయ్స్‌’ టైటిల్ క్యాచీగా యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంది. మోషన్‌ పోస్టర్‌లోని సాంగ్‌, అందులోని సీన్స్‌ చూస్తే ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆశిష్‌ బి.టెక్‌ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నారు. బి.టెక్‌ స్టూడెంట్‌ అయిన హీరో, మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్‌ అయిన అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరంగా ఉంటాయ‌ని తెలిపింది చిత్ర యూనిట్‌. ఇంట్రడక్షన్‌ ర్యాప్‌ వీడియో సాంగ్‌ను రోల్‌ రైడా పాడారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సాంగ్‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు ‘హుషారు’ ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ‘రౌడీ బాయ్స్‌’ చిత్రాన్ని జూన్‌ 25న గ్రాండ్‌గా విడుదల చేయ‌నున్నారు.

ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ హీరొ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
సంగీతం: దేవిశ్రీ‌ప్ర‌సాద్‌,
కో- ప్రొడ్యూస‌ర్ : హ‌ర్షిత్ రెడ్డి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి అనిత‌,
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్,
ద‌ర్శ‌కత్వం: శ్రీ హ‌ర్ష కొనుగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here