‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ట్రైలర్ చాలా బాగుంది – డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్..!!

0
362

మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాతగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. రోజు రోజు కి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కగా, సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల రిలీజ్ చేశారు. ఆ పాట కి మంచి స్పందన వచ్చింది.. ఇంకా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను ఎమ్మెల్యే, కేబినెట్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రిలీజ్ చేశారు.. ముంబై లో ఉన్న పూరీజగన్నాధ్ ఇంటికి వెళ్లి చిత్ర యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ శంకరన్న , అందాల నటి, నిర్మాత చార్మీ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది.. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వం చాలా బాగుంది.. నిర్మాత రాజేష్‌ నాయుడు గారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా నిర్మించాలని కోరుకుంటున్నాను.. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన చాల బాగా కనిపిస్తున్నారు. సినిమా ని అందరు చూడండి.. ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరికి అల్ ది బెస్ట్.. అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి నా కృతజ్ఞతలు.. మా ఆహ్వానాన్ని మన్నించి చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. అలాగే ఈ సినిమా కి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వైఎస్ షర్మిల గారికి, నాగబాబు కొణిదెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి.. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని అన్నారు.

నటీనటులు:
పవన్‌ తేజ్‌, మేఘన,

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌,
సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల,
ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు,
ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌,
ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,
డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌,
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,
విఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ(తిరు),
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్),
నిర్మాత: రాజేష్‌ నాయుడు,
క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here