న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో ‘ఒరేయ్‌ బుజ్జిగా

0
496

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “న్యూ ఇయర్ కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బ్యానర్ లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.“ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌,హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here