స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.4 గా `ఎయిట్` టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

0
381

స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం `ఎయిట్‌`. సూర్యాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఇల్యూజన్ థ్రిల్లర్ గా యూనివ‌ర్స‌ల్ పాయింట్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌. సహ నిర్మాతగా కుషి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్ ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఇన్నొవేటివ్‌గా ఉన్నఈ టైటిల్ పోస్ట‌ర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి నజీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా ఎన్.ఎస్. ప్రసు సంగీతం అందిస్తున్నారు. వంశీ ఎడిటర్. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనుంది చిత్ర యూనిట్‌.
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై కళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన `సూప‌ర్‌మ‌చి`, అలాగే పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన `సుందరి` చిత్రాలు విడుద‌ల‌కి సిద్దంగా ఉన్నాయి.

సప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి..

బ్యాన‌ర్‌: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: సూర్యాస్‌,
నిర్మాత‌: రిజ్వాన్‌,
స‌హ నిర్మాత: కుషి,
సినిమాటోగ్ర‌ఫి: న‌జీర్‌,
సంగీతం: ఎన్ఎస్ ప్ర‌సు,
ఎడిట‌ర్: వ‌ంశి,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here