నాని 28వ సినిమాపై క్రేజీ అప్డేట్

0
81

నేచుర‌ల్ స్టార్ నాని ఇటీవల వి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త‌న 28వ సినిమాతో సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నే ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా,  బ్రోచోవారేవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ని న‌వంబ‌ర్ 21న అనౌన్స్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మ‌ల‌యాళ బ్యూటీ న‌ర్జియా ఫ‌హ‌ద్ న‌టించ‌నున్న‌ట్టు తెలిపారు.  మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాతో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here