తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో కలిసి నటించి బాక్సాఫీస్ ని షేక్ చేశారు. ఈ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటించేందుకు సిద్దమయ్యారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ చిత్రం.’గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని మిని స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళంతో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలవనుంది. నేటి నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
విశాల్, ఆర్య నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: ఆర్ డి రాజశేఖర్,
నిర్మాణ సంస్థ: మిని స్టూడియోస్,
దర్శకత్వం: ఆనంద్ శంకర్.



